పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో 'పులి' సినిమాతో తెరంగేట్రం చేసిన ముద్దుగుమ్మ నికీషా పటేల్. ఆ సినిమా ఆశించిన రిజల్ట్ అందించలేదు. కానీ సినిమాలో అమ్మడి హాట్ హాట్ గ్లామర్‌కి కుర్రాళ్ల నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆ తర్వాత వరుస సినిమాల్లో కనిపించి ఉంటే క్రేజీ బ్యూటీగా పేరు తెచ్చుకునే సత్తా ఉండేది. కానీ అలా జరగలేదు. తర్వాత చాలా గ్యాప్ తీసుకుంది. ఆ పై నటించిన ఒకటీ అరా చిత్రాలు పెద్దగా చెప్పుకోదగ్గవి కాకపోవడంతో పాపం ఈ హాట్ బ్యూటీ సొగసులకు విలువే లేకుండా పోయింది.
అయినా కానీ సోషల్ మీడియాలో ఫుల్ ఫాలోయింగ్ ఉంది నికీషా పటేల్‌కి. ఒకానొక టైంలో బికినీ ఫోటోలతో రెచ్చగొట్టి పిచ్చెక్కించేసింది. కాస్త బొద్దుగా కనిపించే ఈ బ్యూటీ కష్టపడి సన్నగా మారింది. సన్నజాజి నడుముతో బికినీల్లో సెల్ఫీలు దిగి అమ్మడు చేసిన రచ్చకి ఇంప్రెస్ అయిపోయిన ఓ డైరెక్టర్‌గారు అమ్మడితో హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీకి కమిట్ అయ్యారు. అయితే ఆ సినిమా ఎక్కడి వరకూ వచ్చిందో, ఏమయ్యిందో క్లారిటీ లేదు. కానీ తాజాగా ఈ నిషా కళ్ల నికీషా పటేల్‌కి మరో ఆఫర్ వచ్చింది.
తమిళంలో మ్యూజిక్ డైరెక్టర్‌గా, సింగర్‌గా, నటుడిగా సత్తా చాటుతున్న జి.వి.ప్రకాష్ కుమార్ సరసన నటించే ఛాన్స్ దక్కించుకుంది. ఎళిల్ దర్శకుడిగా వ్యవహరిస్తున్న ఈ సినిమాలో నికీషా ఓ సాఫ్ట్‌వేర్ యువతి పాత్రలో కనిపించనుందట. పర్‌ఫామెన్స్‌కి బాగా స్కోపున్న సినిమా అనీ, ఈ సినిమాతో తర్వాత వరుస ఆఫర్లు దక్కించుకోవచ్చని ఆశపడుతోందీ గుజరాతీ భామ నికీషా పటేల్. ఆల్రెడీ తమిళంలో 'భాస్కర్ ఒరు రాస్కెల్' తదితర చిత్రాల్లో నటించింది నికీషా.