'డీజే టిల్లు' మూవీ రివ్యూ & రేటింగ్

మరిన్ని వార్తలు

నటీనటులు: సిద్ధు జొన్నలగడ్డ, నేహా శెట్టి, బ్రహ్మాజీ, ప్రిన్స్ సిసిల్ తదితరులు
దర్శకత్వం : విమల్ కృష్ణ
నిర్మాత: సూర్యదేవర నాగ వంశీ
సంగీత దర్శకుడు: శ్రీచరణ్ పాకల, థమన్ ఎస్(బ్యాక్గ్రౌండ్ స్కోర్)
సినిమాటోగ్రఫీ: సాయి ప్రకాష్ ఉమ్మడిసింగు
ఎడిటర్ : నవీన్ నూలి

 

రేటింగ్: 2.75/5


డీజే టిల్లు..ఈ మధ్య కాలంలో బాగా వినిపించిన పేరు. చిన్న సినిమానే కానీ సితార బ్యానర్ లో రావడం ఆసక్తిని పెంచింది. ట్రైలర్ చూస్తే యూత్ ఫుల్ సినిమా అనే నమ్మకం కలిగించింది. ప్రమోషన్స్ కూడా బాగానే చేశారు. సినిమా ఖచ్చితంగా అలరిస్తుందని భరోసా ఇచ్చారు. మరి  డీజే టిల్లు ఆ నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడా ? ఇంతకీ డీజే టిల్లు కథ ఏమిటి ? 


కథ:


బాల గంగాధర్ తిలక్ ( సిద్దు జొన్నలగడ్డ) ఈ పేరు నచ్చక డీజే టిల్లు అని పేరు మార్చుకుంటాడు. ముందు డిజే ఎందుకంటే.. అతడికి డీజే ప్లేయర్ కావాలని కోరిక. మనోడికి గొప్పలు కూడా ఎక్కువే. ఓ పబ్ లో రాధిక (నేహశెట్టి)తో పరిచయం అవుతుంది. ఆమె మంచి సింగర్. టిల్లు గొప్పలకు పోయి తనకి బన్నీతో సినిమా ఓకే అయ్యిందని రాధికతో మాట కలుపుతాడు. ఆమె కూడా టిల్లు అంటే ఇష్టం చూపినట్లు కనిపిస్తుంది. ఆమెతో ప్రేమలో పడిపోతాడు టిల్లు. ఇంతలో రాధిక టిల్లుకి ఓ షాక్ ఇస్తుంది. తాను ఓ మర్డర్ చేశానని, ఆ క్రైమ్ నుంచి బయటపడటానికి హెల్ప్ చేయాలనీ కోరుతుంది. టిల్లుకి దిమ్మతిరిగిపోతుంది. ఇంతకీ రాధిక ఎవరిని, ఎందుకు హత్య చేసింది ? టిల్లు , రాధికకి హెల్ప్ చేశాడా ? రాధిక రూపంలో టిల్లు ఎలాంటి కష్టాలు ఎదురుకున్నాడు అనేది మిలిగిన కథ. 


విశ్లేషణ:


కొత్త దర్శకులు కొత్తగా ఆలోచిస్తున్నారు. చాలా సింపుల్ లైన్స్ తీసుకొని కథలు అల్లి వినోదం పంచుతున్నారు. ఈ క్రమంలో జాతిరత్నాలు లాంటి ఫన్ జనరేట్ అవుతుంది. డీజే టిల్లు కూడా చాలా సింపుల్ లైనే. ఇంకా చెప్పాలంటే చాలా సిల్లీ లైన్. అయితే ఆ లైన్ తో ఫస్ట్ హాఫ్ ని చాలా ఫన్ గా లాకొచ్చాడు దర్శకుడు. టిల్లు పాత్ర పరిచయం, టిల్లు చుట్టూ వున్న వాతావరణం, పాత్రలు నవ్వులు తెప్పిస్తాయి. రాధిక పాత్ర ఎంటర్ కావడంతో కథ మొదలౌతుంది. ఇంటర్వెల్ వరకూ సాఫీగ సాగుతుంది. 


అయితే సెకెండ్ హాఫ్ వచ్చేసరికి అసలు కష్టాలు మొదలయ్యాయి. ఫస్ట్ హాఫ్ లో పండిన వినోదం సెకెండ్ హాఫ్ లో పండలేదు. కారణం.. ఈ కథని ముందుకు తీసుకెళ్లడానికి అసలు కథే లేకుండాపోయింది. సిల్లీ లైన్స్ తీసుకున్నపుడే వచ్చిన చిక్కే ఇది. వినోదం అంతా మొదటి సగంలో వుంటుంది. తర్వాత చూపించడానికి పాయింట్ వుండదు.  సిల్లీ పాయింట్ పై నడిపే డ్రామా కూడా సిల్లీగా అనిపించే ఛాన్స్ పుష్కలంగా వుంది. టిల్లుకి కూడా ఇదే సమస్య వచ్చింది.


సెకండ్ హాఫ్ లో మెమొరిలాస్, కోర్టు డ్రామా చుట్టూ అల్లుకున్న సీన్స్ నవ్వితెప్పించకపోగా విసుగుతెప్పిస్తాయి. మొదటి సగం చూసి సెకెండ్ హాఫ్ పై అంచనాలు పెట్టుకున్న ప్రేక్షకుడిని నీరుగార్చేస్తాడు దర్శకుడు. చెప్పాల్సిన మేటర్ లేకపోవడంతో సీన్స్ అన్నీ సాగాదీతగా అనిపిస్తాయి. సెకండ్ హాఫ్ లో చూడ్డానికి ఏమీ లేదని ఒక దశలో ప్రేక్షకుడికి అర్ధమైపోతుంది. సెకెండ్ హాఫ్ పై ఇంకాస్త జాగ్రత్త తీసుకొని ఫన్ జనరేట్ చెసినట్లయితే డిజే టిల్లు జాతకం మరోలా వుండేది. 


నటీనటులు:


సిద్దు జొన్నలగడ్డ వన్ మ్యాన్ షో ఇది. డీజే టిల్లుగా జీవించేశాడు. అతడి యాస, నటన చక్కగా పండాయి. టిల్లు పాత్రనే బోలెడు ఫన్ జనరేట్ చేసింది. రాధికగా కనిపించిన నేహ శెట్టి అందంగా వుంది. నటన కూడా ఓకే. ప్రిన్స్ ది కీలక పాత్ర. బ్రహ్మాజీ ఎప్పటిలానే అలరించాడు. మిగతా నటులు పరిధి మేర చేశారు 


టెక్నికల్ గా :


రామ్ మిరియాల, శ్రీ చరణ్ అందించిన మ్యూజిక్ ట్రెండీగా వుంది. పాటలు క్యాచిగా వున్నాయి. తమన్ నేపధ్య సంగీతం కూడా చక్కగా కుదిరింది. కెమరాపనితనం కూడా బావుంది. నిర్మాణ విలువలు ఓకే. దర్శకుడు సెకండ్ హాఫ్ పై కొంచెం శ్రద్దతీసుకొని డ్రామాని ఆసక్తికరంగా మలచినట్లయితే డిజే టిల్లు సూపర్ హిట్ లిస్టు లో చేరిపోయేవాడే. 


ప్లస్ పాయింట్స్


సిద్దు క్యారెక్టరైజేషన్
ఫస్ట్ హాఫ్ కామెడీ 
మ్యూజిక్ 
 

మైనస్ పాయింట్స్


సెకండ్ హాఫ్ సాగదీత 
సిల్లీ ప్లాట్
  

ఫైనల్ వర్దిక్ట్ : టిల్లు.. సిల్లీ ఫెలో


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS