గ్యాంగ్ మూవీ రివ్యూ & రేటింగ్స్

మరిన్ని వార్తలు

తారాగణం: సూర్య, కీర్తి సురేష్, కార్తీక్, రమ్యకృష్ణ తదితరులు
నిర్మాణ సంస్థ: UV క్రియేషన్స్
సంగీతం: అనిరుద్ రవిచందర్
ఎడిటర్: శ్రీకర్ ప్రసాద్
నిర్మాతలు: వంశీ & ప్రమోద్
దర్శకత్వం: విఘ్నేశ్ శివన్

రేటింగ్: 3/5

ఈ సారి సంక్రాంతి బరిలోకి తెలుగు సినిమాలకి పోటిగా ఒక డబ్బింగ్ చిత్రం కూడా వచ్చింది. అదే సూర్య నటించిన గ్యాంగ్. ఈ సినిమా హిందీలో వచ్చిన స్పెషల్ 26 సినిమాకి రీమేక్. అయితే తమిళ హీరోలందరిలోనూ తెలుగులో ఎక్కువ మార్కెట్ కలిగిన హీరో అవ్వడంతో ధైర్యం చేసి తెలుగు సినిమాలకి ధీటుగా ఈ సంక్రాంతి బరిలోకి దింపాడు. మరి ఈ సంక్రాంతి పోటీలో ఎంతవరకు నిలుస్తుంది న్నది ఈ క్రింద సమీక్షలో చూద్దాం..

కథ:

తిలక్ (సూర్య) చిన్నప్పటినుండి CBI ఆఫీసర్ అవ్వాలని కలలు కంటుంటాడు. తీరా ఇంటర్వ్యూకి వెళితే అక్కడ లంచం ఇవ్వలేక తను ఆ CBI ఆఫీసర్ అవ్వలేకపోతాడు. ఇక తనలాగే బయట కూడా ఇలా ఉద్యోగాలకి లంచం ఇవ్వలేక ఎంతోమంది నిరుద్యోగులుగా మిగిలిపోతున్నారు అని తెలుసుకుంటాడు.

దీనితో సూర్యనే సొంతంగా ఒక డూప్లికేట్ CBI టీంని ఏర్పాటు చేసి అందులో ఒక నలుగురు సభ్యులని చేర్చుకుంటాడు. వీరంతా ఒక టీంగా ఏర్పడి తమిళనాడు మంత్రి ఇంటిని రేయిడ్ చేసి డబ్బుని నగలని తీసుకెళతారు. ఇలానే పలు చోట్ల రేయిడ్ చేసి అక్కడ కూడా ఇలానే మోసం చేసి డబ్బుని ఎత్తుకెళతారు. ఇక ఈ డూప్లికేట్ టీంని పట్టుకోవడానికి ఒక స్పెషల్ ఆఫీసర్- శివశంకర్ (కార్తీక్)ని అప్పాయింట్ చేస్తుంది.

మరి శివశంకర్ ఈ డూప్లికేట్ టీంని పట్టుకుంటాడా లేదా అన్నది తెరపైన చూడాలి.

నటీనటుల ప్రతిభ:

సూర్య: పాత్రకి తగ్గట్టుగా ఒదిగిపోవడంలో ఈయన సిద్ధహస్తుడు. ఇక ఈ సినిమా ప్రత్యేకత ఏంటంటే- సూర్య తన పాత్రకి తానే తెలుగులో డబ్బింగ్ చెప్పుకోవడం.

కీర్తి సురేష్: ఈ సినిమాలో పాత్ర అలాగే పాత్ర నిడివి కూడా తక్కువే. పాటలకి కొన్ని సన్నివేశాలకి మాత్రమే కీర్తి పరిమితమైంది.

కార్తీక్: సీనియర్ హీరో కార్తీక్ ఈ సినిమాలో CBI స్పెషల్ ఆఫీసర్ పాత్రలో కనిపించాడు. చాలా రోజుల తరువాత కనిపించినా మంచి పాత్రలోనే కనిపించాడు.

రమ్యకృష్ణ: ఫన్నీగా ఉండే పాత్రలో కనిపించింది. కొన్ని సన్నివేశాల్లో అయితే ఆమె పండించే హాస్యం అందరిని నవ్విస్తుంది.

మిగిలిన తారాగణం తమ పరిది మేరకు నటించారు.

విశ్లేషణ:

స్పెషల్ 26 సినిమాకి రీమేక్ అయినప్పటికీ, దర్శకుడు విఘ్నేశ్ శివన్ తమిళ ఆడియన్స్ కి తగ్గటుగా కొన్ని సన్నివేశాలు చేర్చడం కొన్నిటిని తీసెయ్యడం జరిగింది. ఇక క్లైమాక్స్ ని కూడా కొద్దిగా మార్పు చేశాడు తన కథనంతో. ఇదే సమయంలో డూప్లికేట్ CBI టీంతో కామెడీ పండించే ప్రయత్నం చేశాడు. తనలోని కామిక్ టైమింగ్ ని సినిమాలో పెట్టె ప్రయత్నం చేశాడు.

అయితే ఈ సినిమా కథ విషయానికి వస్తే, ఇది 1987లో జరిగిన యదార్ధ ఘటన అవ్వడంతో దర్శకుడికి ఆ పాయింట్ చుట్టూనే కథనాన్ని అల్లాల్సిన నేపధ్యంలో దర్శకుడికి కత్తిమీద సాములాంటిదే ఈ సినిమా అని చెప్పొచ్చు. ఇక ఈ సినిమా తెలుగు వెర్షన్ కి వస్తే, తమిళ వాసనలు బాగా ఉండడంతో మన తెలుగు ఆడియన్స్ కి అంతగా ఎక్కపోవచ్చు.

అయితే సూర్య తన డబ్బింగ్ తానే చెప్పుకోవడంతో ఆయన తెలుగు అభిమానులకి కిక్ ఇచ్చే అంశం. ఇక పాటల విషయానికి వస్తే, మన ఆడియన్స్ ని తప్పక నిరాశ పరుస్తాయి అలాగే పాటల విజువల్స్ కూడా అంతగా ఎక్కకపోవచ్చు.

ప్లస్ పాయింట్స్:

+ కథ
+ సూర్య

మైనస్ పాయింట్స్:

-  పాటలు
-  తమిళ నేటివిటీ

ఆఖరి మాట:

హిందీలో వచ్చిన స్పెషల్ 26 చూడకపోతే ఈ సినిమా తప్పక నచ్చుతుంది.

రివ్యూ బై సందీప్

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS