Ginna Review: 'జిన్నా' మూవీ రివ్యూ & రేటింగ్!

మరిన్ని వార్తలు

నటీనటులు: విష్ణు మంచు, సన్నీ లియోన్, పాయల్ రాజ్ పుత్.
దర్శకత్వం : ఈశాన్ సూర్య
నిర్మాతలు: మోహన్ బాబు మంచు
సంగీతం: అనూప్ రూబెన్స్
సినిమాటోగ్రఫీ: చోటా కె నాయుడు
ఎడిటర్స్: చోటా కె ప్రసాద్


రేటింగ్: 2.5/5

 

'మా' ప్రిసిడెంట్ అయిన తర్వాత మంచు విష్ణు సినిమాల వేగం తగ్గింది. అంతకుముందు కూడా విష్ణుకి సరైన విజయం దక్కి చాలా రోజులే అయ్యింది. అయితే ఎట్టకేలకు విష్ణు నుండి ఒక సినిమా వచ్చింది. అదే జిన్నా.

 

పాయల్ రాజ్‌పుత్ - సన్నీలియోనీ రూపంలో ఈ సినిమాకి గ్లామర్ తోడైయింది. ట్రైలర్ హారర్‌ విత్ యాక్షన్ కామెడీ అనే నమ్మకం కలిగించింది. మారా హారర్ యాక్షన్ కామెడీ విష్ణు కి ఎలాంటి ఫలితం ఇచ్చింది ? విష్ణు కోరుకునే విజయం దక్కిందా ?

 

కథ:

 

గాలి నాగేశ్వరరావు.. షార్ట్‌కట్‌లో ‘జిన్నా’(మంచు విష్ణు)కి ఊరంతా అప్పులే. ఊళ్లో ఓ టెంట్‌ హౌస్‌ నడుపుతుంటాడు. స్వాతి (పాయల్ రాజ్ పుత్) తో ప్రేమలో కూడా ఉంటాడు. బ్యాడ్ లక్ ఏమిటంటే.. జిన్నా ఏ పెళ్లి కాంట్రాక్ట్‌ తీసుకున్నా.. అది చెడిపోతుంది. దీంతో అతని టెంట్‌ సామాన్లను శుభకార్యాలకు వాడకూడదని, చావులకే వాడాలని తీర్మానం చేస్తాడు ఊరి ప్రెసిడెంట్‌. ఇదే సమయంలో అమెరికా నుండి ఊళ్లోకి ఎంట్రీ ఇస్తుంది రేణుక (సన్నీ లియోన్‌).

 

జిన్నాని ఇష్టపడుతుంది అతన్ని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంటుంది. రేణుక డబ్బుతో అప్పులు తీర్చుకోవచ్చనేది జిన్నా ప్లాన్. అయితే అమెరికా నుండి వచ్చింది రేణుక కాదు రూబీ అని తెలుస్తుంది. తర్వాత ఏం జరిగింది ? అసలు ఈ రూబీ ఎవరు ? జిన్నాని ఎందుకు ఇష్టపడింది ? అనేది మిగతా కథ.

 

విశ్లేషణ:

 

యాక్షన్ కామెడీ ఎంటర్ టైనర్లు ‘ఢీ’, ‘దేనికైనా రెడీ’ విష్ణుకి కలిసొచ్చాయి. అయితే జిన్నాకి వచ్చేసరికి అందులో చిన్న హారర్ ఎలిమెంట్ ని యాడ్ చేశారు. సాధారణంగా విలేజ్ నేపథ్యంలోని కథల్లో ఈ ఎలిమెంట్ డిఫరెంట్ గా అనిపించింది. ఈ ఎలిమెంట్ ని మినహాయిస్తే జిన్నా రొటీన్ మసాలా సినిమాలానే వుంటుంది. జిన్నాగా మంచు విష్ణు పాత్ర పరిచయ, ఊళ్లో అతని అప్పుల ఇవన్నీ రొటీన్ వ్యవహారమే. ప్రథమార్థం అంతా ఆ ఊహలకు తగ్గట్లుగానే వెళ్తున్నట్లు అనిపిస్తుంది. అయితే ఇంటర్ ముందు వచ్చే ట్విస్ట్ కొంత ఆసక్తిని పెంచుతుంది.

 

రేణుక పాత్ర వచ్చిన ట్విస్ట్ ఇంటరెస్టింగ్ గా వుంటుంది. రేణుక పాత్ర వెనకున్న గతం థ్రిల్లింగానే వుంటుంది. అయితే సెకండాఫ్ నుంచి ఈ సినిమా వేరే టోన్ లోకి మారుతుంది. దీంతో మరో కథ చుసిన అనుభూతి కలుగుతుంది.ఈ క్రమంలో వచ్చే సీన్లు రొటీన్‌ హారర్‌ థ్రిల్లర్లను గుర్తుచేసేలా ఉంటాయి. అయితే ఈ సినిమాకి సీక్వెల్ కూడా వుంది. దానిని ద్రుష్టిలో పెట్టుకొని ఈ సినిమాని ముగించిన విధానం పెద్దగా ఆకట్టుకోదు. నిజానికి ఈ చిత్రానికి జిన్నా అనే టైటిల్ పెట్టారు కానీ ఇది రేణుక కథ. సన్నీలియోన్ పాత్ర చుట్టూ ఈ కథ తిరుగుతుంది. ఈ కథని రేణుక కోణంలో డీల్ చేస్తుంటే ఫలితం మరోలా వుండేది. కానీ ఆ కథని రొటీన్ ఫార్మేట్ లో ట్రీట్ చేయడం అంతగా ఆకట్టుకోదు.

 

నటీనటులు:

 

జిన్నా పాత్రలో విష్ణు చాలా ఎనర్జిటిక్ గా చేశాడు. డాన్సులు .. ఫైట్లు లో ఎనర్జీ చూపించాడు. చిత్తూరు యాసలో ఆయన పలికిన సంభాషణలు ఆకట్టుకున్నాయి. జిన్నా పాత్రలో చెప్పిన డైలాగులు కొన్ని ట్రోలింగ్ ని ఉద్దేశించి వున్నాయి.

 

సన్నీ లియోన్ కి కీలకమైన పాత్ర దక్కింది. తన శక్తిమేరకు ఆ పాత్రని చేసింది. పాయల్ అందంగా చేసింది. నరేశ్, చమ్మక్ చంద్ర, వెన్నెల కిశోర్ పాత్రలు పరిధి మేర వున్నాయి.

 

సాంకేతిక వర్గం:

 

ఛోటా కె.నాయుడు కెమరాపనితనం కలర్ ఫుల్ గా వుంది. అనూప్ రూబెన్స్ పాటలు ఓకే అనిపిస్తాయి. హారర్ సీన్స్ కి మంచి నేపధ్య సంగీతం చేశాడు.

 

నిర్మాణ విలువలు కథకు తగ్గట్లుగా ఉన్నాయి. కొన్ని డైలాగులు పేలాయి. దర్శకుడు పట్టుకున పాయింట్ మంచిదే. అయితే దాన్ని తెరపై కొత్తగా ఆవిష్కరించడంలో తడబాటు కనిపించింది. జిన్నా ఒక రొటీన్ సినిమాగానే మిగిలింది.

 

ప్లస్ పాయింట్స్

 

మంచు విష్ణు

రేణుక పాత్ర నేపధ్యం

ట్విస్ట్ లు

 

మైనస్ పాయింట్స్

 

రొటీన్ ట్రీట్ మెంట్

కామెడీ పండకపోవడం

కొన్ని బోరింగ్ సీన్లు

 

ఫైనల్ వర్దిక్ట్ .. జిన్నా కాదు సన్నీ (లియోన్)


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS