'ఖాకి' మూవీ రివ్యూ & రేటింగ్స్

మరిన్ని వార్తలు

తారాగణం: కార్తీ, రకుల్ ప్రీత్, అభిమన్యు సింగ్, బోస్ వెంకట్ తదితరులు..
నిర్మాణ సంస్థ: డ్రీం వారియర్ పిక్చర్స్
సంగీతం: జిబ్రాన్
ఛాయాగ్రహణం: సత్యన్ సూర్యన్
నిర్మాతలు: SR ప్రకాష్ బాబు & SR ప్రభు
రచన-దర్శకత్వం: వినోథ్ 

యావరేజ్ యూజర్ రేటింగ్: 3/5

కార్తీ - రియలిస్టిక్ సినిమాలకి కేర్ అఫ్ అడ్రస్ గా చెప్పుకునే పేరు. ఈయన సినిమాలలో పోషించే పాత్రలు నిజజీవితానికి చాలా దగ్గరిగా ఉండటం వల్ల ఈయన సినిమాలకి సామాన్య ప్రేక్షకుల ఆదరణ బాగా ఉంటుంది. ఇక కార్తీ అన్న సూర్య పోలీసు కథాంశంతో చాలా సినిమాలు చేశాడు అలాగే వెండితెర పైన ఆయన చేసిన ప్రతి పోలీసు చిత్రం విజయవంతమయ్యాయి. మరి అన్న లాగానే తమ్ముడు కూడా పోలీసు కథాంశంతో హిట్ కొడతాడా లేదా అనేది ఈ క్రింద సమీక్షలో చూద్దాం..

కథ..

ధీరజ్ హరిప్రసాద్ (కార్తీ) పోలీసు డిపార్టుమెంటులో DSPగా చేరి చాలా తక్కువ సమయంలోనే ఓ మంచి అధికారిగా పేరు తెచ్చుకుంటాడు. ఇక ధీరజ్ ఇంటిముందు ఉండే ప్రియతో (రకుల్ ప్రీత్) ప్రేమలో పడి ఆమెని పెళ్ళి కూడా చేసుకుంటాడు. ధీరజ్ నిజాయీతీగా ఉండటం వల్ల ఎక్కువగా భదిలీలు అవ్వడం అలా ఒక పోలీసు స్టేషన్ కి వెళ్ళినప్పుడు ఆయనకి ఒక కేసు కంటపడుతుంది.

దాని వివరాలు ఆరాతీయగా హైవేల పక్కన ఉన్న నివాసాలని టార్గెట్ చేస్తూ దోపిడీలకి పాల్పడుతూ మనుషులని అతికీరాతకంగా చంపే ఒక ముఠా గురించి తెలుస్తుంది. అయితే వారి గురించిన ఒక వేలి ముద్ర తప్ప  ఏ ఇతర వివరాలు కాని కీలక ఆధారాలు కాని లభించవు. ఇక  ఆ వేలి ముద్రతో కేసు చిక్కు ముడి విప్పే ప్రయత్నంలో ఆ ముఠా హవారియా తెగకి చెందిన వారిగా గుర్తిస్తాడు.

మరి చివరికి ఆ కేసుని ఎలా ముగించాడు? ఈ దారుణాలకి పాల్పడిన హవారియా ముఠాని ఎలా అంతమొందించాడు అన్నది తెర పైన చూడాలి.

నటీనటుల ప్రతిభ:

కార్తీ: ఈ పోలీసు పాత్ర కోసం తాను ఎంత కష్టపడ్డాడు అలాగే తన శరీరాకృతిని కూడా ఎలా సిద్ధం చేశాడు అన్నది ఈ చిత్రం చూస్తే మనకి అర్ధమవుతుంది. ఇక నటన పరంగా ఎటువంటి ఇబ్బంది లేకుండా నటించేశాడు అనే చెప్పాలి.

రకుల్ ప్రీత్: కార్తీ ప్రేయసిగా, భార్యగా చక్కగా కుదిరింది అనే చెప్పాలి. తను ఉన్న సన్నివేశాలకి పూర్తీ స్థాయిలో న్యాయం చేసింది. అయితే సెకండ్ హాఫ్ లో తను కనపడే సీన్స్ ఒకటి రెండు అంతే..

అభిమన్యు సింగ్: హవారియా ముఠా నాయకుడు ఓమా గా ఆ పాత్రకి కావలసినంత విలనిజాన్ని జోడించాడు.

బోస్ వెంకట్: కార్తీ అసిస్టెంట్ గా సినిమా మొత్తం కార్తీతో సమానంగా సాగే పాత్రలో బాగానే మెప్పించాడు.

విశ్లేషణ:

తమిళనాడులో జరిగిన ఓ యదార్థ సంఘటనని ఆధారం చేసుకొని ఈ చిత్రం రచయత-దర్శకుడు అయిన వినోథ్ ఈ ఖాకీ కథని సిద్ధం చేశాడు. అయితే ఈ కేసు జరిగింది సుమారు పదేళ్ళ క్రితం అవ్వడంతో అప్పటి రోజుల్లో కేసుని ఎలా డీల్ చేశారు అన్నది మనకి చూపెట్టే ప్రయత్నం చేశాడు.

నేరస్తుల కోసం వేరే రాష్ట్రాలకి వెళ్ళినప్పుడు పోలీసులు పడే అవస్థలని కూడా ప్రేక్షకులకి చూపించాడు. ఇక పోలీసులు వారి ఇళ్ళ నుండి దూరంగా ఉన్నప్పుడు ఆ కుటుంబసభ్యులు పడే ఇబ్బందులు, డ్యూటీలో ఉన్నపుడు తమవారిని కోల్పోయినప్పుడు వారి మనోగతాన్ని కూడా తెర పైన చూపాడు.

అలాగే హవారియా తెగ ఎలా ఏర్పడింది అందులో ఉన్నవారు నేరప్రవృత్తికి ఎలా అలవాటుపడ్డారు అన్నది కూడా చాలా వివరంగా చూపెట్టాడు. అయితే ఈ చిత్రం నిజజీవిత ఆధారంగా తెరకెక్కించడం జరిగింది అందుకే కమర్షియల్ ఎలెమెంట్స్ లాంటివి దర్శకుడు జోప్పించలేకపోయాడు.

ఇక కార్తీ-రకుల్ మధ్య ఉండే ప్రేమని మాత్రం బాగా చూపించాడు. తెరపైన వీరి జంట చూడడానికి చాలా బాగుంది.

సాంకేతిక వర్గం పనితీరు:

కెమెరామెన్ సత్యన్ చాలా బాగా పనిచేశాడు, ఆయన ప్రతిభ మనకి తెరపైన కనిపిస్తుంది. ఇక జిబ్రాన్ ఇచ్చిన నేపధ్య సంగీతం ఓకే అనిపిస్తుంది.

ప్లస్ పాయింట్స్:

+ కార్తీ
+ కేసుని చేధించే విధానం

మైనస్ పాయింట్స్:

- చిత్ర నిడివి
- డాక్యుమెంటరీ లా తీయడం

ఆఖరి మాట: ఖాకి- పోలీసు కథలని ఇష్టపడేవారికి మాత్రమే...

రివ్యూ బై సందీప్

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS