నటీనటులు: ఆనంద్ రవి, కిషోరి ధాత్రక్, హరీష్ ఉత్తమన్, శత్రు
దర్శకుడు : శ్రీపతి కర్రి
నిర్మాత: పెళ్లకూరు సామాన్య రెడ్డి
సంగీత దర్శకులు: అనంత నారాయణన్ AG
సినిమాటోగ్రఫీ: కార్తీక్ కొప్పెర
ఎడిటర్: విజయ్ వర్ధన్ కె
రేటింగ్ : 2.25/5
ఈరోజుల్లో కంటెంటే కింగ్. చిన్న సినిమా, పెద్ద సినిమా కాదు... కంటెంట్ బావుంటే చిన్న సినిమాని కూడా పెద్ద సినిమా చేస్తారు ప్రేక్షకులు. దిన్ని ద్రుష్టిలో పెట్టుకొని చాలా మంది ఫిల్మ్ మేకర్స్ వైవిధ్యమైన కథలతో వస్తున్నారు. ఆనంద్ రవి ‘కోరమీను’ ట్రైలర్ చూస్తే కంటెంట్ వున్న సినిమా అనే నమ్మకం కలిగించింది. శత్రు, హరీశ్ ఉత్తమన్ మంచి నటులు ఇందులో కనిపించడం ఆసక్తిని కలిగించింది. మరా ఆసక్తి సినిమాలో కనిపించిందా ? కొరమీను కంటెంట్ వున్న చిత్రం అనిపించుకుందా ? ఇంతకీ కొరమీను కథ ఏంటి ?
కథ:
మీసాల రాజు (శత్రు) ఓ పవర్‌ఫుల్ పోలీసు అధికారి. ఆయనకు మీసాలు అంటే చాలా ఇష్టం. బదిలీపై విజయవాడ నుంచి వైజాగ్‌కు వచ్చిన తొలి రోజే గుర్తు తెలియని కొంతమంది మీసాల రాజు మీసాలను కత్తిరించేస్తారు. దీంతో రగిలిపోతాడు రాజు. మరోవైపు వైజాగ్‌లోని జాలరిపేటను తన గుప్పిట్లో పెటుకుంటాడు కరుణ( హరీశ్ ఉత్తమన్ ). అక్కడ డ్రగ్స్, ఇతర చట్ట విరుద్ద వ్యాపారాలు చేస్తుంటాడు. అతని దగ్గర డ్రైవర్‌గా పనిచేస్తుంటాడు కోటి(ఆనంద్ రవి). అతనికి అదే గ్రామానికి చెందిన మీనాక్షి( కిశోరీ ధాత్రక్) అంటే ప్రేమ. కానీ మీనాక్షి మాత్రం కరుణను ప్రేమిస్తుంది. కరుణ మాత్రం ఆమెను శారీరకంగా వంచించి వదిలేస్తాడు. ఆ తర్వాత మీనాక్షి ఎలాంటి నిర్ణయం తీసుకుంది? ఆమెను కోటీ చేరదీశాడా లేదా? మీసాల రాజు మీసాలను ఎవరు తీశారు? అనేది మిగతా కథ.
విశ్లేషణ:
కోటి,కరుణ, మీను, మీసాల రాజు.. ఈ నలుగురి పాత్రల చుట్టూ తిరిగే కథ ఇది. మీసాల రాజు ఎపిసోడ్ తర్వాత అసలు కథ మొదలౌతుంది. కోటి మీనుని ఇష్టపడటం, మీను కరుణని కోరుకోవడం వరకూ ఆసక్తిగానే వుంటుంది. అయితే కరుణ మీను ని మోసం చేసిన తర్వాత మీను తీసుకున్న నిర్ణయం కథపై ఆసక్తిని పెంచుకుంది. కోటి మీను కలసి బ్రతకాలని భావించడం, ఇది కరుణ ఇగో పై దెబ్బకొట్టినట్లు వుంటుంది. ఐతే ఎమోషన్ ని ఇగో గేమ్ సెకండ్ హాఫ్ లో నడిపివుంటే ఫలితం మరోలా వుంటుంది. కానీ ఒక కిడ్నాప్ డ్రామా ని క్రియేట్ చేస కొరమీను కథని కంగాళీ చేసిపారేశారు.
సెకండ్ హాఫ్ పై ఒక అంచనాతో అడుగుపెట్టిన ప్రేక్షకుడికి ఎలాంటి ఆసక్తి రేకెత్తించినఒక కిడ్నాప్ డ్రామాతో చివరి వరకూ నడిపించేయడం ఏ మాత్రం మెచ్చుకోదగ్గ విషయం కాదు. హీరో హీరోయిన్ మధ్య రొటీన్‌కి భిన్నమైన లవ్ ట్రాక్ వుంది. అయితే దర్శకుడు ఎంచుకున్న ఇగో పాయింట్ కి ఈ కిడ్నాప్ డ్రామా ఏ మాత్రం అతకలేదు. సెకండ్ హాఫ్ అంతా ప్రధాన పాత్రలు దాక్కున్నట్లు కనిపిస్తాయి.
హీరో తండ్రి పాత్రని హత్య చేయడంతో ఎమోషన్ ని రాబట్టుకోవాలని చూశారు కానీ ఇది వర్క్ అవుట్ కాలేదు. విలన్ బారి నుంచి తప్పించుకోటానికి హీరో తన స్నేహితులతో కలిసి ఓ ప్లాన్ వేస్తాడు. హీరో వేసిన ప్లాన్ ప్రకారమే అంతా జరిగిపోతుంది. ఎలాంటి సవాళ్ళుని ఎదురుకోకుండానే కథ ముగిసిపోతుంది. రొటీన్‌కి భిన్నమైన లవ్ ట్రాక్ ని రాసుకున్న దర్శకుడు.. ఆ ప్రేమని గెలిపించుకున్న తీరులో మాత్రం పంక్తు కమర్షియల్ సినిమాల కంటే రొటీన్ గా అలోచించడం నిరాశ పరుస్తుంది.
నటీనటులు:
ఆనంద్ రవి కోటి పాత్రలో ఆకట్టుకున్నాడు హీరోయిన్ కిశోరి ధాత్రిక్ పాత్ర బోల్డ్ గా వుంది. ఆమె నటన కూడా బావుంది. శత్రు, హరీష్ ఉత్తమన్ మరోసారి వారి ప్రతిభ చాటారు.
జబర్దస్త్ ఇమ్యాన్యుయేల్ ఎక్కువ నిడివి వున్నా పాత్ర దక్కింది. అతనిలో మంచి ఆర్టిస్ట్ వున్నాడు. మిగతా పాత్రలు పరిధిమేర వున్నాయి.
టెక్నికల్:
నిర్మాణ విలువలు ఓకే అనిపిస్తాయి. అనంత్ నారాయణ్ ఏజీ సంగీతం బావుంది. ప్రేమలో సెకండ్ హ్యాండ్ ఉండదు అని హీరో చెప్పే డైలాగ్ పేలింది. కెమరాపనితనం ఆకట్టుకుంది. దర్శకుడు సెకండ్ హాఫ్ లో కొంచెం డిఫరెంట్ గా అలోచించాల్సింది. ఇగో స్టొరీ అని క్యాప్షన్ పెట్టి కిడ్నాప్ తో సంతృప్తి పడటం ఆకట్టుకుంది.
ప్లస్ పాయింట్స్ :
డిఫరెంట్ లవ్ స్టొరీ
నటీనటులు
ఓ ట్విస్ట్
మైనస్ పాయిన్స్ :
సాగదీత
సెకండ్ హాఫ్
వినోదం లేకపోవడం
ఫైనల్ వర్దిక్ట్ : కొరమీను రుచి తగ్గింది.