సాయి పల్లవి అందుకే అంత స్పెషల్

మరిన్ని వార్తలు

నటీనటులు ఆయా పాత్రల్లో ఒదిగిపోవడం మామూలే. కొందరైతే జీవించేస్తారు. ఆ కొందరిలోనూ చాలా చాలా అరుదుగా కనిపిస్తారు సాయి పల్లవి లాంటోళ్ళు. నిజమే మరి, అందుకే సాయి పల్లవి అంత స్పెషల్. తొలి సినిమా నుంచి ఇప్పటిదాకా సాయిపల్లవి ఏ సినిమాలోనూ నటిగా ఫెయిల్ అవలేదు. నిజానికి, ఆయా సినిమాలకు ఆమె బిగ్గెస్ట్ అడ్వాంటేజ్‌గా మారుతోంది. ప్రస్తుతం ‘లవ్ స్టోరీ’, ‘విరాటపర్వం’ సినిమాల్లో నటిస్తోంది సాయి పల్లవి.

 

‘లవ్ స్టోరీ’ నుంచి ఈ మధ్యనే ఓ ప్రోమో బయటకు వచ్చింది. అందులో ఓ డాన్స్ మూమెంట్ వేసే క్రమంలో ఆమె గాల్లోకి ఎగిరిన వైనం ఓ అద్భుతం. అంత కళాత్మకంగా బహుశా తెలుగు సినీ పరిశ్రమలోనే కాదు, ఇండియన్ సినిమా స్కీన్‌పైనే ఇంకెవరూ ఎగరలేరేమో. ఇదిలా వుంటే, సాయి పల్లవి తాజాగా ‘విరాటపర్వం’ సినిమా లేటెస్ట్ పోస్టర్‌తో అందరి దృష్టినీ ఆకర్షించింది. పొడగరి రానా దగ్గుబాటి పక్కన విగ్రహం పరంగా కొంచెం డల్‌గా కనిపిస్తున్నా, ఆమె అట్టైర్ మాత్రం అదిరిపోయేలా వుంది. అదనపు హంగులేవీ సాయి పల్లవి అక్కర్లేదు.

 

నిజానికి, ఎక్కువ మేకప్‌ని కూడా ఆమె ఇష్టపడదు. అయినాగానీ, సాయిపల్లవి సమ్‌థింగ్ స్పెషల్. వల్గారిటీకి దూరం.. గ్లామరస్‌గా కనిపించడానికీ ఇష్టపడదు.. అయినా, సాయిపల్లవికి వున్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఏంటీ సీక్రెట్? అనడిగితే, ఏమో.. నాకేం తెలుసు.? అని అమాయకంగా బదులిస్తుంటుంది సాయి పల్లవి.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS