Urvasivo Rakshasivo: ఊర్వశివో.. రాక్షసివో మూవీ రివ్యూ & రేటింగ్!

మరిన్ని వార్తలు

నటీనటులు: అల్లు శిరీష్, అను ఇమ్మాన్యుయేల్, సునీల్, వెన్నెల కిషోర్, ఆమని, కేదార్ శంకర్
దర్శకుడు : రాకేష్ శశి
నిర్మాతలు: ధీరజ్ మొగిలినేని, విజయ్ ఎం
సంగీత దర్శకులు: అచ్చు, అనూప్ రూబెన్స్
సినిమాటోగ్రఫీ: తన్వీర్ మీర్
ఎడిటర్: కార్తీక శ్రీనివాస్ ఆర్


రేటింగ్: 2.75/5


శ్రీరస్తు శుభమస్తుతో మళ్ళీ ట్రాక్ పైకి వచ్చాడు అల్లు శిరీష్. అయితే వెంటనే మళ్ళీ ఫ్లాపు పడింది. దీంతో గ్యాప్ వచ్చింది. చాలా కాలంగా ఓ మంచి హిట్టు కోసం ఎదురు చూస్తున్న శిరీష్‌, రాకేష్ శ‌శి దర్శకత్వంలో ఊర్వశివో.. రాక్షసివో చేశాడు. ట్రైలర్ చూడగానే ఇది రొమాంటిక్ కామెడీ అని అర్ధమైయింది. శ్రీరస్తు శుభమస్తు కూడా రొమాంటిక్ కామెడీని. ఇప్పుడు మళ్ళీ అదే జోనర్ ని నమ్ముకున్నాడు శిరీష్. మరి ఊర్వశివో.. రాక్షసివో శిరీష్ కి విజయాన్ని ఇచ్చిందా ? శిరీష్ మళ్ళీ ట్రాక్ లోకి వచ్చాడా ?


కథ:


శ్రీ (అల్లు శిరీష్‌) సింధూ (అను ఇమ్మాన్యుయేల్‌) ఇద్దరూ ఒకే సాఫ్ట్‌వేర్ కంపెనీలో ప‌నిచేస్తుంటారు. శ్రీ మధ్య త‌ర‌గ‌తి కుటుంబానికి చెందిన కుర్రాడు. సింధూ అమెరికాలో ప‌నిచేసి భారత్‌కు తిరిగొచ్చిన అమ్మాయి. సింధూని చూసి ఇష్టపడతాడు శ్రీ. సింధు కి కూడా శ్రీ మంచిత‌నం, అమాయ‌క‌త్వం న‌చ్చుతాయి. త‌క్కువ స‌మ‌యంలోనే అతడికి ద‌గ్గర‌వుతుంది. ఇద్దరూ శారీర‌కంగా కలుస్తారు. శ్రీ త‌న ప్రేమ‌ని వ్యక్తం చేస్తాడు. ఆమె మాత్రం ప్రేమించడం లేద‌ని చెబుతుంది. అసలు పెళ్లిపై తనకి ఎలాంటి అభిప్రాయాలు వున్నాయో చెబుతుంది. ఇద్దరూ క‌లిసి స‌హ‌జీవ‌నం చేయాల్సిన ప‌రిస్థితి ఏవస్తుంది. మరి వారి స‌హ‌జీవ‌నం ఏ తీరాలకు చేరిందనేది మిగతా కథ.  


విశ్లేషణ:


ఇదో మిడిల్ క్లాస్ అబ్బాయి - హై క్లాస్ అమ్మాయి మ‌ధ్య జ‌రిగిన ప్రయాణం. స‌హ‌జీవ‌నం త‌ర‌హా క‌థ‌లు ఇది వ‌ర‌కు చాలానే చూసేశాం. అయితే ఈ కథని ఫ్రెష్ ఫీలింగ్ కలిగించేలా డీల్ చేయడంలో దర్శకుడు రాకేష్ శ‌శి కొంతమేరకు సఫలమయ్యాడు. శ్రీ‌, సింధుల పాత్రల ప‌రిచ‌యం, ఆఫీసు వ్యవ‌హారాలూ.. ఇలా క‌థ లైటర్ వెయిన్ ప్రారంభం అవుతుంది. శ్రీ, సింధుల ప‌రిచ‌యం త‌ర‌వాత‌... ల‌వ్ ట్రాక్ మొద‌ల‌వుతుంది. ఆ స‌న్నివేశాల‌న్నీ కాస్త ఫ్రెష్‌గానే రాసుకొన్నాడు ద‌ర్శకుడు. బేసిగ్గా ఇలాంటి కథలో సహజీవనం ప్రపోజల్ అబ్బాయి వైపు నుండి వుంటుంది. కానీ ఇందులో అడ్వాన్స్ గా చూపించి ఆ పాత్రని నడిపిన విధానంలో కూడా కొత్తదనం చూపించారు.


తొలి సగం సరదా సన్నివేశాలతో నడిపిన దర్శకుడు సెకండ్ హాఫ్ లో సహజీవనం కాన్సెప్ట్ ని మొదలుపెట్టాడు. ఈ తరహ కథలు చూసినప్పటికీ హీరో ఆడిన దాగుడు మూతలు అలరిస్తాయి. అలాగే ఓటీటీ, వెబ్‌సిరీస్‌ నేపధ్యంలో వెన్నెల కిషోర్ పండించిన కామెడీ, క్రికెట్‌తో పోలుస్తూ సునీల్ చేసే హంగామా అలరిస్తాయి. దర్శకుడు రాసుకున్న సీన్లు పండాయి. కొన్ని డబుల్ మీనింగ్ డైలాగులు ఉన్నప్పటికీ మరీ ఎంత ఎబ్బెట్టుగా వుండవు. క్లైమాక్స్ ఊహించినట్లే వుంటుంది. అయితే ఒక టైం పాస్ సినిమా చుసేమనే అనుభూతి ఇవ్వగలిగింది ఊర్వశివో.. రాక్షసివో.


నటీనటులు:


మిడిల్ క్లాస్ కుర్రాడిగా ఒదిగిపోయాడు అల్లు శిరీష్. సెకండ్ హాఫ్ లో శిరీష్ పరిణితి కనిపించింది. కామెడీ టైమింగ్ కూడా ఆక‌ట్టుకుంటుంది.


అను ఇమ్మాన్యుయేల్ పాత్రని దర్శకుడు చక్కగా డిజైన్ చేశాడు. ఆమెకు మంచి పాత్ర పడింది. సింధూ పాత్రలో ఆమెనటన ఆకట్టుకుటుంది. వెన్నెల కిషోర్‌, సునీల్‌, పోసాని పాత్రలు నవ్విస్తాయి, ఆమ‌ని, కేదార్ శంక‌ర్, పృథ్వీ తదితరులు పాత్ర‌ల ప‌రిధి మేర‌కు న‌టించారు.


సాంకేతిక వర్గం:


నిర్మాణ విలువలు కథకు అనుగుణంగా వున్నాయి. అచ్చు - అనూప్ మ్యూజిక్ ఓకే . కెమెరా పనితనం డీసెంట్ గా వుంది. దర్శకుడు కథని ఫ్రెష్ గా ప్రజంట్ చేశాడు. నిర్మాణ విలువలు మెప్పిస్తాయి.


ప్లస్ పాయింట్స్ :


వినోదం
అల్లు శిరీష్, అను కెమిస్ట్రీ
ఫ్రెష్ ట్రీట్మెంట్


మైనస్ పాయింట్స్


కొన్ని సాగదీత సీన్లు
కథలో పెద్దగా మలుపులు లేకపోవడం


ఫైనల్ వర్దిక్ట్ : నవ్వించే ఊర్వశి!


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS