'కత్తి' లాంటి గ్లామర్‌

మరిన్ని వార్తలు

సినిమా హీరోయిన్‌ అంటే గ్లామర్‌కి కేరాఫ్‌ అడ్రస్‌ అనే మాట నిజం. గ్లామరస్‌గా కనిపించకుండా ఏ హీరోయిన్‌ అయినా నెగ్గుకురావడం కష్టం. గ్లామర్‌ అన్న మాటకి వేరే అర్థాలుండొచ్చుగానీ, హద్దులు దాటని గ్లామర్‌ ఎప్పుడూ అందంగానే ఉంటుంది. అఫ్‌కోర్స్‌ ఈ రోజుల్లో హద్దులు దాటేసిన ఎక్స్‌పోజింగే గ్లామర్‌ అయిపోయింది. అలా హద్దులు దాటేసే భామల్లో ఇదిగో ఈ అందాల భామ కూడా ఒకరు. 'వజా తుమ్‌ హో' సినిమా కోసం హద్దులన్నీ చెరిపేసి అంగాంగ ప్రదర్శన చేసిన ఈ బ్యూటీ పేరు సనాఖాన్‌. తెలుగులో 'కత్తి' సినిమాతో సత్తాచాటుదామనుకుందిగానీ కుదరలేదు. బాలీవుడ్‌లో ఏదో అలా నెట్టుకొచ్చేస్తోంది. అయితేనేం కావాల్సినంత గ్లామర్‌ ఈ బ్యూటీలో ఉంది. అందుకే అవకాశాలలా వచ్చిపడుతూనే ఉన్నాయ్‌. 

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS