మగధీరుడు.. బాక్సాఫీసు వీరుడు.

మరిన్ని వార్తలు

చాలా సినిమాలొస్తాయి అందులో కొన్ని హిట్లూ అవుతాయి ఇంకొన్ని రికార్డులు బద్దలు కొడతాయి. కానీ వందకో, వేయికో ఒక్క సినిమా మాత్రం - చరిత్రగా మిగిలిపోతుంది. చరిత్రనే తిరగరాస్తుంది. చరిత్రకో సంతకం ఇస్తుంది. అలాంటి సినిమా.. 'మగధీర'. టాలీవుడ్ కి కొత్త ఉత్సాహం అందించిన సినిమా మగధీర. బాలీవుడ్ సైతం టాలీవుడ్ వైపు ఆశ్ఛర్యంతో కూడిన అక్కసుతో ఓ లుక్కేసిన సినిమా.. మగధీర. తెలుగు సినిమా లెక్కల్నీ, తలరాతనీ మార్చేసిన సినిమా... మగధీర.

 

మగధీర గొప్ప కథేం కాదు. మూగ మనసులు నుంచీ చూస్తున్న పునర్జన్మ కథే. కాకపోతే ఈసారి విజువల్ ఎఫెక్ట్స్ కలిశాయి. భారీ సెట్టింగులు, హంగు ఆర్భాటాలూ తోడయ్యాయి. రాజమౌళి దర్మకత్వ ప్రతిభకు, తనలో ఉన్న కసికి, తపనకి, పడే కష్టానికి మగధీర ఓ ఉదాహరణగా, భవిష్యత్తులో రాబోయే అద్భుతాలకు సంకేతంలా కనిపించింది. బంగారు కోడి పెట్ట రీమేక్...మెగా ఫ్యాన్స్ కిక్ ఇచ్చింది. అందులో చిరు కనిపించడం, చిరు, చరణ్ ఇద్దరూ కలిసి డాన్స్ చేయడం... మరింత జోష్ పెంచింది. వంద మందిని ఒక్కసారి చంపే ఎపిసోడ్, అందులో షేర్ ఖాన్ డైలాగులు కేక పుట్టించాయి. గుర్రాల పరుగులు, ఎత్తైన కోటలు... ఈ కథకు కొత్త లుక్ తీసుకొచ్చాయి. హాలీవుడ్ సినిమాని తలపించే పోరాట ఘట్టాలు, మన తెలుగు సినిమా కమర్షియాలిటీ మర్చిపోకుండా పేర్చిన పాటలు, అన్నింటికి మించి రామ్ చరణ్ నట విశ్వరూపానికి కాజల్ నయా అందాలు తోడై, సాంకేతిక నిపుణుల కష్టం ఫలించి.. మగధీర చరిత్రగా మిగిలిపోయింది.

 

చరిత్రలో నిలిచిపోయింది. మగధీర తరవాత టాలీవుడ్ చాలా మారింది. మగధీర సాధించిన వసూళ్లు చూసి... తెలుగు సినిమా స్టామినా ఏమిటో, తెలుగు సినిమాపై ఎంత ఖర్చు పెట్టొచ్చో అర్థమైంది. నిన్న బాహుబలి, రేపు.. సైరా రాబోతున్నాయంటే.. అందుకు స్ఫూర్తి మగధీరనే. ఇవే కాదు... భవిష్యత్తులో విజులవ్ ఎఫెక్ట్స్ కి సంబంధించిన ఏ సినిమా రావాలన్నా... మగధీరని ఓ సారి గుర్తు చేసుకుని, మగధీర ఇచ్చిన స్ఫూర్తిని నరనరాన నింపుకుని కథలు రాసుకోవాల్సిందే. అందుకే.. మగధీరుడు... బాక్సాఫీసు వీరుడయ్యాయి. టాలీవుడ్ తలరాత మార్చే యోధుడయ్యాడు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS