ఇస్టార్ట్ సీక్వెల్ ఎలా ఉండబోతోంది?

మరిన్ని వార్తలు

కొంత కాలంగా టాలీవుడ్‌కి మంచి మాస్ మ‌సాలా సినిమా రాలేద‌న్న లోటు తీర్చింది... ఇస్మార్ట్ శంక‌ర్‌. రెండో వారంలోనూ... బీ,సీల‌లో ఇస్మార్ట్ శంక‌ర్ హ‌వా చూపిస్తోంది. `డి య‌ర్ కామ్రేడ్‌` విడుద‌లైనా - ఇస్మార్ట్ జోరు ఎక్క‌డా త‌గ్గ‌లేదు. ఈ ఊపులోనే `డ‌బుల్ ఇస్మార్ట్` మొద‌లెట్టాల‌న్న ఆలోచ‌న‌లో ఉన్నాడు పూరి. `ఇస్మార్ట్ శంక‌ర్` షూటింగ్ ద‌శ‌లో ఉండ‌గానే సీక్వెల్ ఆలోచ‌న వ‌చ్చింది పూరికి. లైన్ కూడా సిద్ధం చేసేసుకున్నాడు. ఇప్పుడు దాన్నే ప‌ట్టాలెక్కిస్తాడ‌ని తెలుస్తోంది.అయితే... ఈసారి ఒక రామ్ కాద‌ట‌... ఈ సినిమాలో ఇద్ద‌రు రామ్‌లు ఉంటార‌ని స‌మాచారం. అందుకే `డ‌బుల్ ఇస్మార్ట్` అనే టైటిల్ ఫిక్స్ చేశాడ‌ట పూరి.

 

రామ్ మాత్రం.. ఇస్మార్ట్ శంకర్ టైటిల్‌ని వాడుకుని, వేరే క‌థ చెబితే బాగుంటుంద‌ని ఆలోచిస్తున్నాడ‌ట‌. సీక్వెల్ పేరుతో ఒకే క‌థ‌ని అటు తిప్పి ఇటు తిప్పి చెబితే.. జ‌నాలు చూడ‌ర‌ని, కేవ‌లం క్యారెక్ట‌రైజేష‌న్‌ని వాడుకుని, కొత్త క‌థ చెబితే వ‌ర్కువుట్ అవుతుంద‌ని పూరికి స‌ల‌హా ఇచ్చాడ‌ట‌. పూరి కూడా ప్ర‌స్తుతం ఈ క‌థ విష‌యంలో పున‌రాలోచ‌న‌లో ప‌డ్డాడ‌ని తెలుస్తోంది. రామ్ ప్ర‌స్తుతం విదేశాల్లో ఉన్నాడు. ఆగ‌స్టు మొద‌టివారంలో హైద‌రాబాద్ వ‌స్తున్నాడు. త‌ను వ‌చ్చిన త‌ర‌వాతే డ‌బుల్ ఇస్మార్ట్ పై ఓ క్లారిటీ వ‌స్తుంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS