'అర్జున్‌రెడ్డి'తో సంచలనం సృష్టించిన ముద్దుగుమ్మ షాలినీ పాండే హీరోయిన్‌గా, మ్యూజిక్ డైరెక్టర్ జీవి ప్రకాష్ హీరోగా తమిళంలో రూపొందుతోన్న చిత్రం '100 పర్సెంట్ కాదల్'. తెలుగులో తమన్నా, చైతూ జంటగా రూపొందిన '100 పర్సెంట్ లవ్' చిత్రానికి తమిళ రీమేక్‌గా తెరకెక్కుతోంది ఈ చిత్రం. తాజాగా ఈ సినిమా ట్రైలర్ విడుదలైంది.
కథలో పెద్దగా మార్పులు చేసినట్లు లేదు కానీ, కొన్ని కొన్ని బోల్డ్ సీన్స్ విషయంలో ఇంకాస్త ఎక్కువ చేసినట్లు తెలుస్తోంది. నాజూకు అందాలతో తమన్నా తెలుగు ప్రేక్షకుల్ని మెస్మరైజ్ చేసేసింది. అయితే తమన్నాతో పోల్చితే షాలినీ పాండేకి గ్లామరేం తక్కువ కాదు కానీ, కొంచెం బొద్దుగా ఉంటుంది. అయినా తమిళ తంబీలకు బొద్దు భామలంటేనే మక్కువ ఎక్కువ. ట్రైలర్‌ని బట్టి చూస్తే తమిళ తంబీలు షాలినీ అందాలకు బుట్టలో పడిపోయేలానే ఉన్నారు.
కానీ చూడాలి మరి టీజర్, ట్రైలర్‌తో మంచి రెస్పాన్స్ అందుకుంటోన్న '100 పర్సెంట్ కాదల్' విడుదలయ్యాక ఎలాంటి రెస్పాన్స్ అందుకోనుందో. త్వరలో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. 'అర్జున్‌రెడ్డి' సినిమాతో ఇటు తెలుగులోనూ, తమిళంలోనూ కూడా మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంది షాలినీ పాండే. తర్వాత నటించిన 'మహానటి'లో చిన్న పాత్రే అయినా పర్‌ఫామెన్స్ పరంగా మెప్పించింది. ఇప్పుడు '100 పర్సెంట్ కాదల్'లో మరోసారి 'అర్జున్‌రెడ్డి' తరహాలో గ్లామర్ విత్ పర్‌ఫామెన్స్ రోల్ పోషిస్తోంది.