'హ్యాపీడేస్' సినిమాతో యూత్ పల్స్‌ని కరెక్ట్‌గా పట్టేసిన దర్శకుడు శేఖర్ కమ్ముల. యూత్‌ఫుల్ ఎంటర్టైనర్గా మంచి విజయం సాధించింది ఆ సినిమా. తర్వాత 'లీడర్' తదితర చిత్రాలతో శేఖర్ కమ్ముల తనదైన ముద్ర వేసుకున్నాడు దర్శకుడిగా.
లిమిటెడ్‌గా సినిమాలు తెరకెక్కించే శేఖర్ కమ్ముల లాంగ్ గ్యాప్ తర్వాత 'ఫిదా'తో కెరీర్లో బ్లాక్ బస్టర్ హిట్‌ని సొంతం చేసుకున్నాడు. 'ఫిదా'తో వచ్చిన విజయోత్సాహాన్ని వెంటనే కరిగించేసుకోకుండా కొన్నాళ్లు మళ్లీ జాగ్రత్త పడ్డాడు. ఇప్పుడే మరో రొమాంటిక్ స్టోరీని ప్రిపేర్ చేసుకున్నట్లు తాజా సమాచారమ్. 'ఫిదా'లాంటి సూపర్ క్యూట్ డిఫరెంట్ లవ్‌స్టోరీతో మరోసారి ఫిదా చేసేందుకు సిద్ధమవుతున్నాడు శేఖర్ కమ్ముల. అయితే ఈ సినిమాలో నటించబోయే నటీనటులు, ఇతర టెక్నీషియన్లు ఎవరనేది తెలియాలంటే కాస్త ఆగాలి.
ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోందీ ప్రాజెక్ట్. కాగా ఏషియన్ గ్రూప్స్ కంపెనీ ఈ సినిమాతో నిర్మాణ రంగంలోకి అడుగుపెడుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం శేఖర్ కమ్ముల హీరో, హీరోయిన్స్ వేటలో బిజీగా ఉన్నాడట. ఈ సినిమాతోనూ ఖచ్చితంగా 'ఫిదా' లాంటి హిట్ కొట్టాలనే కసితో శేఖర్ మ్ముల ఉన్నట్లు తెలుస్తోంది.
'ఫిదా'తో సాయిపల్లవిని హీరోయిన్గా పరిచయం చేసిన శేఖర్ కమ్ముల తాజా సినిమా కోసం మరో ఫ్రెష్ హీరోయిన్ని పరిచయం చేసే పనిలో ఉన్నాడనీ తెలుస్తోంది.