చిరంజీవి సినిమా `ఇంద్ర`ని ఎవరూ మర్చిపోలేరు. చిరు కెరీర్‌లో ఇది మరో అపూర్వమైన విజయం. ఫ్యాక్షన్ కథని ఎంచుకోవడం చిరుకి తొలిసారి.. అదే చివరి సారికూడా. పాటలు, డైలాగులు, చిరు వేసిన స్టెప్పులు.. ఇప్పటికీ అభిమానుల్ని అలరిస్తూనే ఉంటాయి. బి.గోపాల్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం విడుదలై నేటికి 18 ఏళ్లు. ఈ సందర్భంగా `ఇంద్ర`లోని పవర్ ఫుల్ డైలాగుల్ని ఓసారి గుర్తు చేసుకుంటే..
* రాననుకున్నారా.. రాలేననుకున్నారా
* మొక్కేకదా అని పీకేస్తే.. పీక కోస్తా
* సింహాసనం మీద కూర్చునే అర్హత అక్కడ ఆ ఇంద్రుడిది.. ఇక్కడ ఈ ఇంద్రసేనారెడ్డిది
* కాశీకి పోయాడు... కాషాయం మనిషైపోయాడు వారణాశిలో బతుకుతున్నాడు.. వరస మార్చాడు అనుకుంటున్నారా..?అదే పౌరుషం.. అదే రక్తం
* తప్పు నావైపు ఉందని తల దించుకుని వెళ్తున్నా - లేదంటే ఇక్కడి నుంచి తలలు తీసుకుని వెళ్లేవాడిని
* ఎవరి పేరు చెబితే సీమ ప్రజల ఒళ్లు ఆనందంతో పులకరిస్తుందో, ఎవరి పేరు చెబితే కరువు సీమలో మేఘాలు గర్జించి వర్షిస్తాయో, ఎవరి పేరు చెబితే బంజరు భూములు పంట పొలాలుగా మారతాయో, ఎవరి పేరు చెబితే శత్రువులు గుండెలు జలదరిస్తాయో.. అతనే ఇంద్రసేనా రెడ్డి
* నరుక్కుంటూ పోతే అడవి కూడా మిగలదు చంపుకుంటూ పోతే మనిషన్నవాడు మిగలడు
ఇలా ఎన్నో మంచి సంభాషణలు రాశారు పరుచూరి సోదరులు. ఈ సంభాషణలు చిరు పలికిన విధానం, ఆ ఎమోషన్‌ని వెండి తెరపై చూపించిన పద్ధతీ... మెగా అభిమానులకు బాగా నచ్చాయి. అందుకే ఈ సినిమాని సూపర్ హిట్ చేశారు.