నవంబర్ 29న '2.0' సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. రజనీకాంత్, అక్షయ్‌కుమార్, అమీ జాక్సన్ ప్రధాన పాత్రల్లో రూపొందిన ఈ సినిమా కోసం సుమారు 600 కోట్లు ఖర్చు చేసినట్లు, '2.0' టీమ్ ఇప్పటికే ప్రచారం చేసింది ఇంత పెద్ద మొత్తంలో ఖర్చు చేసిన ఈ సినిమాకి ఆ స్థాయిలో ప్రీ రిలీజ్ హైప్ వస్తోందా.? అంటే, రాలేదని చెప్పక తప్పదు.
టైమ్ దగ్గర పడుతోంది. ప్రచారం హోరెత్తాల్సింది పోయి, సాదా సీదాగా జరుగుతోంది. మామూలుగా రజనీకాంత్ సినిమాలకుండే హైప్ తప్ప, 'అంతకు మించి' అనే స్థాయిలో మాత్రం ఊపు రావడంలేదు. విదేశాల్లో అత్యధిక థియేటర్లలో విడుదల చేస్తుండడం, దేశంలోనూ అత్యధిక థియేటర్లలో విడుదల చేస్తుండడం వంటివన్నీ రజనీకాంత్ సినిమాలకి సాధారణమే. తన రికార్డుల్ని తానే బద్దలుగొట్టుకోవడం రజనీకాంత్‌కి కొత్త కాదు. కానీ, 600 కోట్ల బడ్జెట్ కాబట్టి, అంచనాలకు మించేలా హైప్ వచ్చి వుండాలి. ఆ హైప్ కన్పించడంలేదు. '2.0' మర్చండైజ్ అంటూ ఇంకో పబ్లిసిటీ స్టంట్‌కి తెరలేపింది నిర్మాణ సంస్థ.
అయితే దీనికీ ఆశించిన స్థాయిలో రెస్పాన్స్ రావడంలేదని సమాచారమ్. ఏడాది క్రితమే విడుదల కావాల్సిన '2.0' సినిమా కొన్ని కారణాలతో ఆలస్యమయ్యింది. ఆ ఇంపాక్ట్ పడిందా.? లేదంటే ఇంకేమన్నా కారణాలున్నాయా.? అని 'లైకా' సంస్థ మల్లగుల్లాలు పడ్తోంది.
గట్టిగా ఇంకో ఐదు రోజులే సమయం వుంది. ఈలోగా '2.0' సినిమాకి కావాల్సిన హైప్ తీసుకు రాగలుగుతారా? వేచి చూడాలిక.