హెబ్బా.. ఈ ముద్దులు తట్టుకోలేమబ్బా

మరిన్ని వార్తలు

కేవలం ముద్దులతోనే సినిమాలు ఆడేస్తాయనుకుంటే అది పొరపాటు. సినిమాలో కథ, కథనం బావుంటే, దానికి యూత్‌ అప్పీల్‌ యాడ్‌ అయ్యి.. ఆ తర్వాత ముద్దులు అదనపు బోనస్‌ అవుతాయేమో. 

'ఆర్‌ఎక్స్‌100' సినిమా సక్సెస్‌ అయ్యిందనీ, 'అర్జున్‌రెడ్డి' అంతకు ముందే సంచలన విజయం సాధించిందనీ, ఈ రెండిటిలోనూ కామన్‌ 'మూతి ముద్దులే'ననీ చాలా సినిమాలు ఈ తరహా జోనర్‌లో రూపొందాయి. జోనర్‌ ఏదయినా, మూతి ముద్దులు వుంటే చాలనుకునే దర్శకులు చాలామందే వున్నారు. కానీ 'మిణుగురులు' లాంటి సినిమా తీసి మంచి మేకర్‌ అని పేరు తెచ్చుకున్న దర్శకుడి నుంచి కేవలం 'ముద్దుల' చుట్టూనే తిరిగే ఓ సినిమా వస్తుందని ఎలా ఆశించగలం? హెబ్బా పటేల్‌ హీరోయిన్‌ అనగానే, ఈ సినిమాకి 'అదో టైపు' ప్రచారం ఆటోమేటిక్‌గా జరిగిపోయింది. 

అయితే ఓ పక్క ఆ టైపు కంటెంట్‌, ఇంకో వైపు మెసేజ్‌ ఇచ్చేయాలన్న ప్రయత్నం వెరసి '24 కిస్సెస్‌' సినిమాని ఎటూ కాకుండా చేసేశాయి. గాఢమైన ముద్దులు వృధా అయిపోయాయన్న భావన కలుగుతుంది. అస్సలేమాత్రం ఈ సినిమా.. ప్రేక్షకుల్ని అలరించేలా లేదని రివ్యూలు వస్తున్నాయి. హెబ్బా పటేల్‌, '24 కిస్సెస్‌' అనే టైటిల్‌ మాత్రమే ఈ సినిమాపై కాస్తో కూస్తో హైప్‌ రావడానికి కారణమని నిస్సందేహంగా చెప్పొచ్చు. 

ఇలాంటి సినిమాల్నే ఇంకా ఇంకా హెబ్బా పటేల్‌ ఎంచుకుంటూ వెళితే, ఆమెపై 'ఆ టైపు' ముద్ర ఇంకా బలపడిపోవడం మినహా, ఆమెకు ఏ ప్రయోజనమూ వుండదు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS