2.0 సినిమా చూడాలన్న ఉత్కంటకి ఇంకొక రెండు నెలల్లో తెరపడనుంది. ఇక ఈ సినిమాకి సంబంధించిన ప్రోమోషన్స్ ని దర్శకుడు శంకర్ మొదలెట్టేసాడు.
అందులో భాగంగానే ఒక వెబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో 2.0 గురించిన కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ప్రధానంగా మనకి టీజర్ లో కనిపించిన పక్షి రూపకల్పనకే తాము చాలా కష్టపడాల్సి వచ్చిందని చెప్పాడు. ముందుగా ఒక గ్రాఫిక్ కంపెనీకి ఈ పనులు అప్పగించగా వారు అనుకున్న సమయానికి అందివ్వని కారణంగా ఈ పనిని వేరే కంపెనీకి ఇవ్వడం వారు చేయడం వల్ల ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పైన తీవ్ర ప్రభావం చూపినట్టుగా తెలిపారు.
ఇదే సమయంలో ఇప్పటివరకు భారతదేశ చరిత్రలోనే అత్యతిదిక బడ్జెట్ తో రూపొందించిన సినిమాగా ఈ 2.0 చరిత్ర సృష్టించనుంది అని చెప్పాడు. ఇప్పటికి ఈ సినిమా నిర్మాణం, ప్రమోషన్లకి కలుపుకుని సుమారు రూ 576 కోట్ల మేర వెచ్చించారట.
అయితే విడుదలైన టీజర్ నుండి ఈ సినిమా కథని ఊహిస్తూ సోషల్ మీడియాలో వచ్చిన కథలని నమ్మవద్దు అని ఒక క్లారిటీ ఇచ్చాడు. ఇక పోనుపోను ఈ 2.0 గురించిన మరెన్ని విషయాలు తెలియనున్నాయో చూడాలి.