రజనీకాంత్ ఫ్యాన్స్‌ని డిజప్పాయింట్ చేశాడు ట్రైలర్‌తో. ఇన్నేళ్లు సినిమాని తీర్చి దిద్ది ట్రైలర్ రిలీజ్ ఫంక్షన్ కోసం భారీ ఏర్పాట్లు చేసి, చివరికి పస లేని ట్రైలర్‌ని రిలీజ్ చేశారు.
ట్రైలర్‌కి వస్తున్న రెస్పాన్స్ అంతంత మాత్రమే అనుకోవాలి. ఎంతో ఎక్స్‌పెక్ట్ చేసిన 2.0' ట్రైలర్ ఇంతగా నిరాశ పరుస్తుందని అస్సలు ఊహించలేదు అభిమానులు. టోటల్‌గా ట్రైలర్ చూస్తే ట్రైలర్‌లో 'రోబో'గా నటించిన సూపర్‌స్టార్ రజనీకాంత్ కన్నా, విలన్‌గా కనిపించిన అక్షయ్ కుమార్ ఎక్కువగా ప్రొజెక్ట్ అయ్యాడు.
అయితే అక్షయ్ కుమార్‌కి కూడా ఓవర్ మేకప్ కారణంగా ఆ పాత్రలో ఉన్నదెవరో తెలియని గందరగోళ పరిస్థితి ఏర్పడింది. అలా 2.0 ట్రైలర్ పూర్తిగా నిరాశపరిచిందంటూ సోషల్ మీడియాలో ఆల్రెడీ ట్రాలింగ్ కూడా మొదలైంది. 'రోబో' మొదటి పార్ట్‌లో చూసిన సీన్స్‌నే ఈ ట్రైలర్‌లో రిపీట్ చేశారు, అక్షయ్ కుమార్ క్యారెక్టర్ తప్ప అంతకు మించిన కొత్తదనమేమీ '2.0'లో లేదనే టాక్ కూడా వినిపిస్తోంది.
ఇకపోతే '2.0' కన్నా ఒక్కరోజు ముందు విడుదలైన షారూఖ్‌ఖాన్ 'జీరో' ట్రైలర్ అందర్నీ బాగా ఎట్రాక్ట్ చేసేసింది. మరుగుజ్జు పాత్రలో షారూఖ్‌ఖాన్ నవ్వులు పూయించడంతో పాటు, అన్ని రకాల ఎమోషన్స్‌నీ పండిస్తున్నాడు. పిల్లలతో పాటు, పెద్దలు కూడా ఈ ట్రైలర్‌ని బాగా ఎంజాయ్ చేస్తున్నారు. గ్లామర్, యాక్షన్, ఎమోషన్ అన్నీ పుష్కలంగా 'జీరో' ట్రైలర్‌లో ఫ్యాన్స్‌కి అందాయి.
సో 'జీరో', '2.0' రెండు ట్రైలర్స్‌లో ఏది గొప్పో నిర్ణయం అభిమానులు విజ్ఞతకే వదిలేస్తున్నాం.