శంకర్‌ ఓ శాస్త్రవేత్త: అక్షయ్‌కుమార్‌

మరిన్ని వార్తలు

తమిళ దర్శకుడు శంకర్‌ని అక్షయ్‌కుమార్‌ శాస్త్రవేత్తగా అభివర్ణించాడు బాలీవుడ్‌ నటుడు అక్షయ్‌కుమార్‌. '2.0' సినిమాలో అక్షయ్‌ విలన్‌గా నటిస్తున్న విషయం విదితమే. రజనీకాంత్‌ హీరోగా తెరకెక్కిన ఈ సినిమా ట్రైలర్‌ ఈ రోజు విడుదలయ్యింది. 

ట్రైలర్‌ విడుదల కార్యక్రమంలో పాల్గొన్న అక్షయ్‌కుమార్‌, ఈ సినిమాలో తాను నటించడానికి కారణం శంకర్‌, రజనీకాంత్‌ అని చెప్పాడు. ఏ సినిమా అయినా శంకర్‌ చేయాలనుకున్నప్పుడు, ఆ పాయింట్‌ మీద అతని రీసెర్చ్‌ చాలా చాలా వుంటుందనీ, ఆ సమయంలో అతనిలో ఓ శాస్త్రవేత్త వుంటాడని అక్షయ్‌కుమార్‌ చెప్పాడు. '2.0' సినిమా భారీ బడ్జెట్‌ కావడంతోనే తాను ఈ సినిమాలో నటించలేదనీ, అంతకు మించి ఇదొక సాంకేతిక అద్భుతమని భావించి ఇందులో నటించడానికి ముందుకొచ్చానన్నాడు అక్షయ్‌కుమార్‌. 

ఏ దర్శకుడికి అయినా 'శాస్త్రవేత్త' అన్న ప్రశంసను మించిన ప్రశంస ఇంకేముంటుంది? అది కూడా విలక్షణ చిత్రాల్ని ఎంచుకుంటూ స్టార్‌డమ్‌ని పక్కన పెట్టి, అద్భుతమైన పాత్రల్లో నటిస్తోన్న అక్షయ్‌కుమార్‌ నుంచి శంకర్‌ 'శాస్త్రవేత్త' అనే ప్రశంసలు అందుకోవడం చాలా చాలా గొప్ప విషయం. '2.0' సినిమాలో తనను చూసి, అంతా తనను రియల్‌ లైఫలోనూ విలన్‌ అనుకుంటారని అక్షయ్‌కుమార్‌ చమత్కరించాడు.

 

మరోపక్క, అక్షయ్‌కుమార్‌ ఫిట్‌నెస్‌ సీక్రెట్‌ గురించి హీరో విశాల్‌ ప్రశ్నించాడు. ఉదయాన్నే నిద్ర లేవడం, ఆ తర్వాత తగినంత వ్యాయామం చేయడం, మంచి ఆహారం తీసుకోవడం, ఎప్పుడూ ఆనందంగా వుండడం ఇవే తన ఫిట్‌నెస్‌ సీక్రెట్‌ అని అక్షయ్‌కుమార్‌ వివరించాడు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS