2019 లవ్‌ బర్ద్స్‌ వీళ్లే.!

By Inkmantra - December 24, 2019 - 15:00 PM IST

మరిన్ని వార్తలు

ఈ ఏడాది తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 3 జనంలో మంచి ఆదరణ పొందింది. 16 మంది కంటెస్టెంట్స్‌తో 13 వారాల పాటు సాగిన బిగ్‌బాస్‌ సీజన్‌ 3కి నాగార్జున హోస్ట్‌గా వ్యవహరించారు. కాగా, 16 మంది కంటెస్టెంట్స్‌లో రాహుల్‌ సిప్లిగంజ్‌, పునర్నవి భూపాళం ప్రత్యేకతను చాటుకున్నారు. బిగ్‌బాస్‌కి ఈ జంట ప్రత్యేక ఆకర్షణ అయ్యింది. స్నేహానికి మించి వీరిద్దరి మధ్యా ఇంకేదో ఉందన్న ఫీలింగ్‌ జనాన్ని బిగ్‌బాస్‌ షోకి ఆకర్షించేలా చేసింది. తమ క్యూట్‌ క్యూట్‌ అల్లరి చేష్టలతో ఈ జంట నిజంగానే ఆకట్టుకుంది. ప్రతీ సీజన్‌లోనూ ఓ లవ్‌ జంట బిగ్‌బాస్‌ సీజన్‌లో సందడి చేస్తూ వస్తోంది. కానీ, గత సీజన్స్‌లో లేనంత క్రేజ్‌ పునర్నవి, రాహుల్‌ సిప్లిగంజ్‌ జంటకు దక్కింది.

 

ఈ సీజన్‌కి బిగ్‌బాస్‌ విజేతగా నిలిచిన రాహుల్‌ సిప్లిగంజ్‌, షో నుండి బయటికి వచ్చాక కూడా పునర్నవితో సేమ్‌ ఫ్రెండ్‌షిప్‌ కంటిన్యూ చేయడం, వీరి ఫ్రెండ్‌షిప్‌పై రకరకాల ఆసక్తికరమైన కథనాలు రావడం, ఈ ఏడాది ఒకింత ఆసక్తిని కలిగించిన అంశం. ఇదిలా ఉంటే, బయటికొచ్చాక ఎప్పటిలానే విజేత రాహుల్‌ సిప్లిగంజ్‌కి సినిమా అవకాశాలు పోటెత్తుతాయన్న గుసగుసలు వినిపించాయి. అంతేకాదు, షోతో వచ్చిన క్రేజ్‌తో రాహుల్‌ - పునర్నవి జంటగా సినిమాలు తెరకెక్కించేందుకు కొందరు నిర్మాతలు కూడా ముందుకొచ్చారు. అయితే, ప్రస్తుతం ఆ స్టేటస్‌ ఏంటీ.? అనేదానిపై మాత్రం అంతగా క్లారిటీ లేదనుకోండి. అయితే, 2019 ప్రేమ జంటగా పునర్నవి - రాహుల్‌ జంట మాత్రం వెరీ వెరీ స్పెషల్‌గా నిలిచిందనడం అతిశయోక్తి కాదు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS