వరుస ఫ్లాపులతో రేసులో బాగా వెనకబడిపోయాడు శ్రీనువైట్ల. `అమర్ అక్బర్ ఆంటోనీ` దెబ్బకు శ్రీనువైట్లకు ఛాన్సులు ఇవ్వడానికే భయపడుతున్నారంతా. కానీ తన ప్రయత్నాలు మాత్రం మానలేదు. తాజాగా బెల్లంకొండ శ్రీనివాస్‌కి కథ చెప్పి ఓకే చేయించుకున్నాడట శ్రీనువైట్ల. బెల్లంకొండతో సినిమా అంటే నిర్మాతలు ఎప్పుడూ రెడీగానే ఉంటారు.
కథ నచ్చితే బెల్లంకొండ సురేష్ సినిమా తీసేస్తాడు. అయితే ఈ సినిమా మాత్రం బయటి బ్యానర్లో చేయాలని ఫిక్సయినట్టు తెలుస్తోంది. శ్రీనువైట్ల ఫ్లాప్ రికార్డు భయపడుతున్నా - ఒకరిద్దరు నిర్మాతలు ఈ సినిమా చేయడానికి ముందుకొచ్చినట్టు తెలుస్తోంది. అన్నీ ఓకే అయితే 2020 జనవరిలో ఈ సినిమాకి సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. చూద్దాం.. కొత్త యేడాదిలో అయినా శ్రీనువైట్ల జాతకం మారుతుందేమో...?