2025 టాలీవుడ్ ఆశల పల్లకిలో హిట్ బొమ్మలెన్నో

మరిన్ని వార్తలు

2024 టాలీవుడ్ జర్నీ సూపర్ హిట్ అయ్యింది. లాస్ట్ ఇయర్ జనవరిలో వచ్చిన హనుమాన్ మూవీతో బోణీ కొట్టిన టాలీవుడ్. తరవాత కల్కి, దేవర, పుష్ప 2 లాంటి పాన్ ఇండియా హిట్స్ అందుకుంది. కొన్ని పరాజయాలున్నా బ్లాక్ బస్టర్ హిట్స్ వాటిని మర్చిపోయేలా చేసాయి. కొత్త సంవత్సరం ప్రారంభం అయ్యింది. ఈ ఏడాది టాలీవుడ్ లో వచ్చే సినిమాలపై ఆశలు పెట్టుకున్నారు సినీప్రియులు. మేకర్స్ కూడా కొత్తఏడాదిలో తమ లక్ ఎలా ఉంటుందో పరిక్షించుకోనున్నారు. భారీ అంచనాలున్న సినిమాలు 2025 లో రిలీజ్ అవుతున్నాయి. అవన్నీ అంచనాలు మించి హిట్స్ సాధిస్తే టాలీవుడ్ స్థాయి మరింత పెరుగుతుంది.

కొత్త సంవత్సరం మొదలైన కొద్దీ రోజుల్లోనే గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన పాన్ ఇండియా మూవీ 'గేమ్ చేంజర్' రిలీజ్ అవుతోంది. జనవరి 10 న వరల్డ్ వైడ్ గా ఈ మూవీ రిలీజ్ అవుతోంది. శంకర్ దర్శకత్వం లో తెరెకెక్కిన ఈ సినిమాలో కియారా అద్వానీ, అంజలి హీరోయిన్స్ గా నటిస్తున్నారు, దిల్ రాజు నిర్మాత. సంక్రాంతి బరిలో దిగుతున్న సినిమాలో గేమ్ చేంజర్ హై బడ్జెట్ మూవీ. భారీ అంచనాలతో వస్తున్న ఈ పాన్ ఇండియా సినిమా హిట్ అయితే టాలీవుడ్ న్యూ ఇయర్ జర్నీ స్టార్ట్ చేసినట్లే. సంక్రాంతి బరిలో చెర్రీ తో పాటు సీనియర్ హీరోలు బాలయ్య,వెంకటేష్ పోటీ పడుతున్నారు.

బాలయ్య - బాబీ కాంబో లో వస్తున్న డాకు మహారాజు మూవీపై కూడా అంచనాలు బాగానే ఉన్నాయి. పైగా బాలయ్యకి సంక్రాంతి సెంటిమెంట్ కలిసి వస్తుంది. వెంకీ - అనిల్ రావిపూడి కాంబో 'సంక్రాంతికి వ‌స్తున్నాం' మూవీ పై ఇప్పటికే పాజిటీవ్ టాక్ వస్తోంది. అచ్చమైన సంక్రాంతి బొమ్మ ఇదని తెలుస్తోంది. ఈ మూడు హిట్ అయితే ఆరంభం అదిరినట్టే. నెక్స్ట్ ప్ర‌భాస్ 'రాజాసాబ్‌' తో ఏప్రిల్ లో రానున్నాడు. పాన్ వరల్డ్ స్టార్ గా గుర్తింపు పొందిన ప్ర‌భాస్ మూవీకి కలక్షన్ల విషయంలో సందేహం లేదు. నెక్స్ట్ మెగాస్టార్ నటించిన  'విశ్వంభ‌ర‌' మే లో ఉంటుంది. విశ్వంభర బ్లాక్ బస్టర్ కావటం ఖాయం అని వినిపిస్తోంది.

ఎప్పటినుంచో ప‌వ‌న్ క‌ల్యాణ్ మూవీ కోసం ఎదురు చూస్తున్న ఫాన్స్ కి డబుల్ ట్రీట్ ఇస్తూ  'హ‌రి హ‌ర వీర‌మ‌ల్లు', 'ఓజీ' 2025 లోనే రిలీజ్ అవుతున్నాయి. బాలయ్య 'అఖండ 2' ద‌స‌రాకు  రానుంది. నాగ చైతన్య సాయి పల్లవి నటించిన 'తండేల్' ఫిబ్రవరి, మార్చ్ లో రానుంది.  విజ‌య్ దేవ‌ర‌కొండ మూవీ మేలో రిలీజ్ అవుతోంది. నాని 'హిట్ 3', ర‌వితేజ 'మాస్ జాత‌ర‌' లాంటి భారీ అంచనాల సినిమాలు ఉన్నాయి. వీటితో  2025 లో టాలీవుడ్ జర్నీ బ్లాక్ బస్టర్ అని ఫిలిం నగర్ టాక్.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS