లిప్ టు లిప్ కిస్ అంటేనే, అది అసభ్యత. ఇంగ్లీష్ సినిమాల్లో అది కామన్. మన ఇండియన్ సినిమాల్లోనూ అది క్రమక్రమంగా కామన్ అయిపోతోంది. అయినప్పటికీ, ఇండియన్ సినిమాల్లో లిప్ టు లిప్ కిస్ అంటే, అది పొయెటిక్‌గా కన్పించడంలేదు.. వల్గర్‌గానే కన్పిస్తోంది. దీనికి దర్శ నిర్మాతలు, నటీనటులు ఇచ్చే కవరింగ్ మాత్రం ఇంకోలా వుంటోంది. చూసే కళ్ళని బట్టి అసభ్యత అనేది ఆధారపడి వుంటుందన్నది వారి మాట.
అసలు విషయానికొస్తే, '24 కిస్సెస్' అనే సినిమా రాబోతోంది. ఇందులో హీరోయిన్ హెబ్బా పటేల్, హీరోతో పోటీ పడి లిప్ టు లిప్ కిస్‌లు ఇచ్చేసింది. పైగా, ఈ ముద్దల కోసం ఆక్రోబాటిక్ వేషాలూ వేయించేశారు. 'మరీ ఇంత బరితెగింపా.?' అంటూ సినిమా స్టిల్స్, పోస్టర్స్‌పై విమర్శలు వస్తోంటే, 'అబ్బే, అందులో అసభ్యత ఏమీ వుండదు' అని చిత్ర దర్శక నిర్మాతలంటున్నారు. 'రధం' అనే సినిమా విషయంలోనూ ఇంతే.
ఈ మధ్య తెలుగు సినిమాలంటే లిప్ టు లిప్ కిస్ వుండాల్సిందేనన్న భావన అందరిలోనూ కలుగుతోంది. 'అర్జున్ రెడ్డి' సినిమా కావొచ్చు, 'ఆర్ ఎక్స్ 100' సినిమా కావొచ్చు. ఇవి సక్సెస్ అయ్యాయంటే కేవలం లిప్ టు లిప్ కిస్‌లే కారణం కాదు. ఇంకా చలా విషయాలున్నాయి వాటి సక్సెస్‌కి కారణాలుగా. క్లోజప్‌లో హీరోయిన్ నాభి చూపిస్తే కొన్నాళ్ళ క్రితం సెన్సార్ కత్తెర వేటు పడింది. కానీ, ఇప్పుడు పరిస్థితి అలా లేదు.
అసభ్యతే అందం అయిపోయిందనుకోవాలేమో.