ఇది క్లియర్‌.. ఎన్టీఆర్‌ ఎంత చెప్పినా ఒప్పుకోలేదంతే

మరిన్ని వార్తలు

'మహానటి' సినిమాలో స్వర్గీయ ఎన్టీఆర్‌ పాత్రలో నటించాల్సి వచ్చినా, అందుకు యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ ఒప్పుకోలేదు. కారణం, తాతయ్య స్వర్గీయ ఎన్టీఆర్‌ మీద అభిమానేమనని యంగ్‌ టైగర్‌ చెప్పాడు. ఆ మహానుభావుడి పాత్రలో నటించేంత అనుభవం లేదు, అంతటి సాహసమూ చేయలేనని ఆయన స్పష్టం చేశాడు. 

అలాంటి యంగ్‌ టైగర్‌, 'ఎన్‌టిఆర్‌ బయోపిక్‌'లో ఛాన్స్‌ వస్తే వదులుకుంటాడా? ఏదన్నా చిన్న పాత్రలో అయినా కనిపించేందుకు ఆస్కారం వుంది. కానీ, ఇక్కడా ఎన్టీఆర్‌ ఛాన్స్‌ తీసుకోలేదు. కారణం ఏంటో తెలియదుగానీ, బాబాయ్‌ బాలయ్య వచ్చి అడిగినా, దర్శకుడు క్రిష్‌ ఒప్పించే ప్రయత్నం చేసినా యంగ్‌ టైగర్‌ ససేమిరా అనేశాడట. చివరికి వాయిస్‌ ఓవర్‌ ఇవ్వాల్సిందిగా కోరినా, యంగ్‌ టైగర్‌ ఒప్పుకోలేదని సమాచారమ్‌. దాంతో చిత్ర యూనిట్‌ కూడా ఆశలు వదిలేసుకుంది యంగ్‌ టైగర్‌ మీద. 

ఈ సినిమాకి ఏ రకంగానూ యంగ్‌ టైగర్‌ పార్టిసిపేషన్‌ లేదని 'ఎన్‌టిఆర్‌ బయోపిక్‌' యూనిట్‌ క్లారిటీగా చెప్పేసింది. అంటే, ఇకపై ఒప్పించే ప్రయత్నాలేవీ వుండబోవన్నమాట. నందమూరి కుటుంబం నుంచి ఈ సినిమాలో బాలకృష్ణతోపాటు, కళ్యాణ్‌రామ్‌ కూడా నటిస్తున్న సంగతి తెల్సిందే. నారా చంద్రబాబునాయుడు పాత్రలో దగ్గుబాటి రానా, బసవతారకం పాత్రలో విద్యాబాలన్‌, శ్రీదేవి పాత్రలో రకుల్‌ ప్రీత్‌ సింగ్‌.. ఇలా 'ఎన్‌టిఆర్‌ బయోపిక్‌'కి భారీ తారాగణమే వుంది. 

ఇంతటి చారిత్రక చిత్రంలో యంగ్‌ టైగర్‌ నటించి వుంటేనే బావుండేదని అభిమానులు భావిస్తున్నారు. కానీ, యంగ్‌ టైగర్‌కీ కొన్ని ఆలోచనలుంటాయి కదా, వాటినీ గౌరవించాల్సిందే తప్పదు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS