ఆటోజానీ... ఆశ‌లింకా ఉన్నాయ్‌!

By Gowthami - April 23, 2020 - 17:00 PM IST

మరిన్ని వార్తలు

పూరి జ‌గ‌న్నాథ్ చిత్ర‌సీమ‌లోకి అడుగుపెట్టి 20 ఏళ్ల‌య్యింది. ఈ ప్ర‌యాణంలో ఎన్నో ఎత్తు ప‌ల్లాలు చ‌వి చూశాడు. టాప్ హీరోలంద‌రితోనూ ప‌నిచేశాడు. అయితే చిరంజీవితో మాత్రం వ‌ర్క్ చేయ‌లేదు. ఆ అవ‌కాశం వ‌చ్చిన‌ట్టే వ‌చ్చి చేజారిపోయింది. ఆటోజానీ సినిమా స్క్రిప్టు ద‌శ‌లోనే ఆగిపోయింది. అయితే... చిరు తో సినిమా విష‌యంలో త‌న ప్ర‌య‌త్నాలు ఆప‌లేదు పూరి. ఇప్ప‌టికీ ఆ స్క్రిప్టుపై క‌స‌ర‌త్తులు చేస్తూనే ఉన్నాడ‌ట‌. త్వ‌ర‌లోనే చిరుతో ప‌నిచేసే అవ‌కాశం వ‌స్తుంద‌న్న ఆశాభావం వ్య‌క్తం చేస్తున్నాడు పూరి.

 

ఇటీవ‌లే ఇస్మార్ట్ శంక‌ర్‌తో ఓ సూప‌ర్ హిట్ కొట్టాడు పూరి. ఇప్పుడు విజ‌య్ దేవ‌ర‌కొండ‌తో ఓ సినిమా చేస్తున్నాడు అది కూడా హిట్ట‌యితే... పూరికి చిరుతో సినిమా చేసే ఛాన్స్ దొర‌కొచ్చు. పైగా చిరు ఇప్పుడు ఫుల్ స్వింగ్ లో ఉన్నాడు. కొత్త ద‌ర్శ‌కుల‌తో ప‌నిచేయ‌డానికి రెడీ అవుతున్నాడు. ఎవ‌రు ఎలాంటి ఇంట్ర‌స్ట్రింగ్ స్క్రిప్టు చెప్పినా - విన‌డానికి రెడీ అంటున్నాడు. అందుద‌కే.. `ఆటోజానీ`పై మ‌ళ్లీ ఆశ‌లు రేగాయి. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS