'రోబో 2.0' ఆ మ్యాజిక్‌ చేయలేకపోయింది.!

మరిన్ని వార్తలు

సూపర్‌స్టార్‌ 'రోబో 2.0'  సినిమాకి , 'బాహుబలి'ని మించి అంచనాలున్నాయి. కానీ ఆ అంచనాలు తొలి రోజు ఓపెనింగ్స్‌కే రాలేదని ప్రచారం జరుగుతోంది. తెలుగు రాష్ట్రాల్లో తొలి రోజు కలెక్షన్స్‌ 18.5 కోట్లు వరకూ వచ్చిందనీ సమాచారమ్‌. తమిళనాడులో తొలిరోజు వసూళ్లు మాత్రం అదరగొట్టేశాయి. ఓవర్సీస్‌లోనూ అదే స్థాయిలో వసూళ్లు వచ్చాయి. అయినా కానీ 'బాహుబలి'ని ఓవరాల్‌గా '2.0' టచ్‌ చేయలేకపోయింది. ప్రమోషన్స్‌ విషయంలో కొంత అలసత్వం తొలి రోజు వసూళ్లపై ప్రభావం చూపిందని ట్రేడ్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

అయితే రజనీకాంత్‌ అభిమానులు మాత్రం '2.0' గురించి ఎక్స్‌ట్రీమ్‌ ఫిగర్స్‌ ప్రచారం చేస్తూనే ఉన్నారు. ఇదిలా ఉంటే తెలుగులో ఏ డబ్బింగ్‌ సినిమాకీ రాని వసూళ్లు '2.0' సినిమాకి వచ్చాయని తొలిరోజు వసూళ్లను విశ్లేషిస్తూ ట్రేడ్‌ పండితులు పేర్కొన్నారు. అయినప్పటికీ కూడా రికార్డు స్థాయిలో రైట్స్‌ అమ్ముడుపోయిన దర్మిలా ఇది ఎంతవరకూ సేఫ్‌ ప్రాజెక్ట్‌ అనేది ముందు ముందు తెలుస్తుంది. శంకర్‌ దర్శకత్వంలో తెరకెక్కిన విజువల్‌ వండర్‌ 'రోబో 2.0'. అమీజాక్సన్‌ హీరోయిన్‌గా నటించింది.

బాలీవుడ్‌ నటుడు అక్షయ్‌ కుమార్‌ కీలక పాత్ర పోషించాడు. అక్షయ్‌ పాత్రను మేకప్‌తో పూర్తిగా నింపేసినా, ఆయన పర్‌ఫామెన్స్‌కి మంచి మార్కులు పడుతున్నాయి. అలాగే సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ ఎనర్జీ గురించి మాట్లాడుకోకుండా ఉండలేకపోతున్నారు. లైకా ప్రొడక్షన్ప్‌ బ్యానర్‌లో 600 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన చిత్రం 'రోబో 2.0'.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS