తోడల్లుళ్లే కాదు, మామా అల్లుళ్లు కూడా సిద్ధం.!

By iQlikMovies - November 30, 2018 - 14:54 PM IST

మరిన్ని వార్తలు

మెగా ప్రిన్స్‌ వరుణ్‌తేజ్‌, విక్టరీ వెంకటేష్‌ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న 'ఎఫ్‌ 2' సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో వరుణ్‌కి జోడీగా మెహ్రీన్‌, వెంకీకి జోడీగా మిల్కీబ్యూటీ తమన్నా నటిస్తున్నారు. కాగా వెంకీ ఓ పక్క ఈ సినిమా షూటింగ్‌తో బిజీగా ఉంటూనే, మరో సినిమానీ లైన్‌లో పెట్టేశాడు. అదే మేనల్లుడు నాగచైతన్యతో వెంకీ నటిస్తున్న 'వెంకీ మామ' చిత్రం. బాబీ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది.

ఆల్రెడీ లాంఛనంగా స్టార్ట్‌ అయిన ఈ సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ డిశంబర్‌ 12 నుండి ప్రారంభం కానుందట. చెన్నైలో ఫస్ట్‌ షెడ్యూల్‌ షూటింగ్‌ని ప్లాన్‌ చేస్తున్నారట. ఈ సినిమాలో చైతూకి జోడీగా రకుల్‌ ప్రీత్‌సింగ్‌ నటిస్తుందని ప్రచారం జరుగుతోంది. అలాగే వెంకీ సరసన శ్రియ అని టాక్‌. అయితే హీరోయిన్స్‌ విషయంలో అఫీషియల్‌గా క్లారిటీ లేదు కానీ, డిశంబర్‌ 13న వెంకీ బర్త్‌డే సందర్భంగా ఈ సినిమాకి సంబంధించిన ఫ్రెష్‌ అప్‌డేట్‌ ఒకటి రిలీజ్‌ చేయనున్నారట. కాగా ఈ సినిమాలో వెంకీ, చైతూ రియల్‌ లైఫ్‌ క్యారెక్టర్స్‌నే పోషిస్తున్నారు. అంటే మామా అల్లుళ్లలా అన్నమాట.

'ప్రేమమ్‌' చిత్రంలో ఆల్రెడీ స్క్రీన్‌పై చైతూకి మామగా కాస్సేపు కనిపించి సందడి చేసేశాడు వెంకటేష్‌. కాసేపు సందడికే ఫ్యాన్స్‌ ఫిదా అయిపోయారు ఆ సినిమాలో. ఇక ఫుల్‌ లెంగ్త్‌ మామా అల్లుళ్లలా వీరిద్దరూ చేయబోయే సందడి అలా ఇలా ఉండదంట. ఫుల్‌ లెంగ్త్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా 'వెంకీ మామ'ను తెరకెక్కించేలా డైరెక్టర్‌ బాబీ స్క్రిప్టు సిద్ధం చేశారట. దేవిశ్రీ ప్రసాద్‌ ఈ సినిమాకి మ్యూజిక్‌ అందిస్తున్నారు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS