సుకుమార్ లైనప్.. మాములుగా లేదు

మరిన్ని వార్తలు

టాలీవుడ్ డైరక్టర్ రేంజ్ నుంచి పాన్ ఇండియా డైరక్టర్ స్థాయికి చేరుకున్నాడు సుకుమార్. అల్లు అర్జున్ తో తీసిన 'పుష్ప' మూవీతో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు  తెచ్చుకున్నాడు. అంతే కాకుండా 69 జాతీయ చలన చిత్ర అవార్డ్స్ లో బెస్ట్ యాక్టర్ గా బన్నీకి, బెస్ట్ మ్యూజిక్ డైరక్టర్ గా దేవి శ్రీ ప్రసాద్ కి నేషనల్ అవార్డ్స్ వచ్చాయి. 67 వ ఫిల్మిఫేర్ అవార్డ్స్ సౌత్ లో బెస్ట్ దర్శకుడిగా పుష్ప సినిమాకి గాను సుకుమార్ అవార్డు అందుకున్నారు. 2004 లో ఆర్య సినిమాతో  సినీ ప్రయాణం మొదలు పెట్టి, 20 ఏళ్ళ కాలంలో బెస్ట్ డైరక్టర్ గా ఎదిగారు. టాలీవుడ్ లో అత్యధిక పారితోషికం తీసుకుంటున్న దర్శకులలో ఒకడిగా సుకుమార్ స్టార్ స్టేటస్ అందుకుంటున్నాడు. సుకుమార్ తో సినిమాలు చేయటానికి పలువురు హీరోలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 


సుకుమార్ ప్రస్తుతం బన్నీతో పుష్ప కి సీక్వెల్ గా పుష్ప 2 చేస్తున్నాడు. ఈ సినిమా ఆగస్టు 15 వరల్డ్ వైడ్ గా రిలీజ్  కానుంది. ఈ నేపథ్యంలో సుకుమార్ నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏంటి అన్న ఆసక్తి అందరిలో నెలకొంది. పుష్ప 2 తరవాత గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తో ఒక సినిమా చేయనున్నట్లు  అనౌన్స్ చేసాడు సుకుమార్. ఇది రంగస్థలం  మూవీకి సీక్వెల్ అని ప్రచారం జరుగుతోంది. కానీ ఇందులో ఎంత నిజముందో తెలియదు. నెక్స్ట్ విజయ దేవరకొండతో ఒక సినిమా చేయనున్నట్లు తెలుస్తోంది. 


ఒక పక్క పాన్ ఇండియా హీరోలతో సినిమాలు చేస్తూ మధ్యలో విజయ దేవరకొండ లాంటి క్రేజీ హీరోతో కూడా సుక్కు మూవీ ప్లాన్ చేస్తున్నాడని సినీప్రియులు సంతోషపడుతున్నారు. నిజానికి మూడేళ్ల క్రితమే ఈ సినిమా చేయాల్సింది. 2022లో ఫాల్కన్ క్రియేషన్స్ సంస్థ వీరిద్దరి కాంబోలో మూవీ అనౌన్స్ చేసింది. కానీ ఎందుకో బ్రేక్ పడింది. మళ్ళీ ఇన్నాళ్ళకి విజయ సుక్కు కాంబో మూవీ తెరపైకి వచ్చింది. విజయ్ ప్రస్తుతం గౌతమ్ తిన్ననూరి తో వర్క్ చేస్తున్నాడు. తరవాత రాహుల్ సాంకృత్యాయన్, రవికిరణ్ కోలాతో ప్రాజెక్ట్స్ చేయనున్నాడు. సుక్కు పుష్ప 2 తరవాత చెర్రీ  సినిమా ఫినిష్ చేసి, రౌడీ హీరోతో సినిమా చేయనున్నాడని టాక్.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS