మెగా బ్రదర్ కి చుక్కలు చూపించిన బాలయ్య ఫాన్స్

By iQlikMovies - January 06, 2019 - 13:10 PM IST

మరిన్ని వార్తలు

గత కొద్దికాలంగా మెగా బ్రదర్ నాగబాబు అనూహ్యమైన పోస్టులతో బాల్లయ్యను టార్గెట్ చేయటం అందరికీ తెలిసిందే. ఎప్పుడో 'పవన్ కళ్యాణ్ ఎవరో నాకు తెలీదు' అన్న బాలకృష్ణ వ్యాఖ్యలకు కౌంటర్లుగా నాగబాబు సోషల్ మీడియాలో చేస్తున్న హంగామా బాలయ్య ఫాన్స్ కి, మెగా ఫాన్స్ కి మధ్య వివాదాలను పెంచుతుంది. 'నందమూరి బాలకృష్ణ ఎవరో నాకు తెలియదు.. అంటూ ఒకసారి, సారీ.. సారీ.. బాలకృష్ణ ఎవరో తెలియదు అనడం నా తప్పే.. ఆయన ఒక పెద్ద కమెడియన్.. కామెడీ బాగా చేస్తారు.. అంటూ మరోసారి మెగా బ్రదర్ నాగబాబు, బాలకృష్ణ పై సంచలన కామెంట్స్ చేశారు.

 

తాజాగా ఈ వివాదాన్ని మరింత రాజేస్తూ ‘కట్టు కథలు కొన్ని.. కల్పనలు ఇంకొన్ని.... చుట్టనేల.. మూట కట్టనేల... నిజం కక్కలేని బయోపిక్కులొద్దయా.. విశ్వదాభి రామ వినరా మామా...' అంటూ 'కవిత్వాలు చెప్పడం మాకూ వచ్చండోయ్..' అనే క్యాప్షన్ తో బాలకృష్ణ నటించిన ఎన్టీఆర్ బయోపిక్ గురించి ఒక విమర్శాత్మకమైన కవిత పోస్ట్ చేసాడు. ఇవన్నీ గమనిస్తూ వచ్చిన బాలయ్య ఫాన్స్ దొరికిన అవకాశాన్ని అదునుగా తీసుకుని నాగబాబుకు చెమటలు పట్టించారు. తాజాగా చెన్నైలో ఓ ఫంక్షన్ కి ముఖ్య అతిథిగా హాజరైన నాగబాబుకి నందమూరి అభిమానుల నుండి నిరసన సెగ తగిలింది.

 

వేదికపై నాగబాబు మాట్లాడుతుండగా 'జై బాలయ్య' అంటూ నినాదాలు చేసారు. అంతటితో నాగబాబు ఆగకుండా ప్రసంగిస్తున్న సందర్భంలో 'ఏంటీ, బాలకృష్ణ ఎవరో తెలీదా..! కోకోకోలా పెప్సీ ..బాలయ్య బాబు సెక్సీ' అని అరుస్తూ రచ్చ రచ్చ చేసారు. అక్కడ బాలయ్య ఫాన్స్ హవా ఎక్కువవుండడంతో నాగబాబు అసహనంతో ప్రసంగం ముగింపుకి ముందే నిష్క్రమించినట్లు తెలుస్తుంది. ఇన్ని రోజుల నుంచి ఒక వైపు నుండే కౌంటర్లు వేస్తూ ఆనందించిన మెగా బ్రదర్ మొదటిసారిగా బాలయ్య అభిమానుల నుంచి ఇబ్బంది ఎదుర్కొన్నారు. దీంతో అయినా ఈ విమర్శల యుద్ధం ఆగుతుందో.. లేక ఇంకా పెద్దదవుతుందో చూడాలి మరి..!


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS