ఆర్జీవీని దర్శకుడిగా పరిచయం చేసినా.. నాగార్జున కి స్టార్ డం ఇచ్చినా.. అదంతా శివ సినిమా వల్లనే అని చెప్పొచ్చు.
ఇక ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీ లో బయోపిక్స్ హవా నడుస్తుండగా శివ తీసిన ఆర్జీవీ పైన ఒకరు బయోపిక్ తీయడానికి ఆసక్తి చూపుతూ ఆయనని సంప్రదించారట. దానికి ఆయన తన పైన సినిమా తీయడం కన్నా తన తోలి సినిమా ఎలా తీయగలిగాను అసలు ఆ చిత్రం తీయడానికి ఎటువంటి ప్రయత్నాలు చేసాను అనేది ఇంకా ఆసక్తిగా ఉంటుంది అని సూచించాడట.
దీనితో వర్మ పైన సినిమా తీయాలనుకున్న వారికి ఇలా వేరే పాయింట్ దొరకడంతో దాని పైన సినిమా తీసేందుకు సిద్ధమవుతున్నారట. ఇదేగనుక కార్యరూపం దాలిస్తే, నిజంగా ఇదొక కొత్త ప్రయోగంగా మిగిలిపోతుంది.
అయితే శివ విడుదలై 25 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈ చిత్రం పైన ఒక డాక్యుమెంటరీ వచ్చిన సంగతి విదితమే.. అట్లాంటిది ఇప్పుడు ఏకంగా ఒక చిత్రమే రానుండడం విశేషమే అని చెప్పాలి.