ఇప్పుడు ఫిల్మ్ మేకర్స్ అంతా వెబ్ సిరీస్ మీద పడ్డారు. సెన్సార్ ప్రోబ్లమ్స్ లేవు వెబ్ సిరీస్‌కి. దాంతో విచ్చల విడిగా వెబ్ సిరీస్ తెరకెక్కుతున్నాయి. ఇంతవరకూ 'రాగిణి ఎమ్మెమ్మెస్' సీక్వెల్‌లో ఇంతవరకూ చాలా సినిమాలొచ్చాయి. అయితే తాజా సీక్వెల్‌ని వెబ్ సిరీస్‌గా రూపొందించాలని నిర్మాత ఏక్తా కపూర్ భావిస్తోందట. అలా వెబ్ సిరీస్‌కి ఈ మధ్య బోలెడంత పాపులారిటీ వచ్చేసింది.
ఇటీవల వివాదాల దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ తెరకెక్కించిన 'జీఎస్‌టీ (గాడ్ సెక్స్ అండ్ ట్రూత్)' కూడా వెబ్ సిరీసే. అలా తాజాగా తమిళంలో ఓ వెబ్ సిరీస్ రూపొందనుంది. నిమేష్ దర్శకత్వంలో రూపొందనున్న ఈ వెబ్ సిరీస్‌లో శ్రీ నిఖ హీరోయిన్‌గా నటిస్తోంది. 'ఎ స్టోరీ' అనే టైటిల్‌తో 'సెక్స్ ఈజ్ ఏన్ ఆర్ట్' అనే ఉపశీర్షికతో ఈ వెబ్ సిరీస్ రూపొందుతోంది. ఇది కూడా అడల్ట్ కంటెన్ట్‌తోనే రూపొందనున్నట్లు తెలుస్తోంది. ఈ వెబ్ సిరీస్‌ని తెలుగులోకి కూడా అనువదించే యోచనలో ఉన్నారట.
బాలీవుడ్‌లో ఇలాంటివి చాలానే వస్తూ ఉంటాయి. సౌత్‌లో ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతోందీ వెబ్ సిరీస్ కల్చర్. దానికి ముందుగా ఆధ్యం పోసిన డైరెక్టర్ కూడా వర్మే. అప్పుడెప్పుడో 'గన్స్ అండ్ థైస్' పేరుతో ఓ వెబ్ సిరీస్ రిలీజ్ చేశాడు. మొన్నామధ్య 'కడప' వెబ్ సిరీస్ అన్నాడు. ఇటీవల విడుదల చేసిన 'జీఎస్‌టీ' వెబ్ సిరీస్ సృష్టించిన ప్రకంపనలు ఏ పాటివో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తాజాగా తమిళంలో మొదలైన ఈ కల్చర్ తమిళ తంబీలను ఎలా ప్రభావితం చేయనుందో చూడాలిక.