రాజకీయాల్లో ప్రస్తుత పరిణామాలు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌కి అనుకూలంగా కనిపించడం లేదట. దాంతో పవన్ కళ్యాణ్ యూ టర్న్ తీసుకోబోతున్నాడా అంటే అవునంటున్నాయి సినీ వర్గాలు. ఇటీవల గుంటూరు సభ తర్వాత పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో చూపించాల్సిన వేగం చూపించలేకపోయారు.
రాజకీయాల్లో క్షణం క్షణం మారుతున్న పరిణామాలతో పవన్ నెగ్గుకు రావడం కష్టమని సన్నిహితులు పవన్‌కు సూచిస్తున్నారట. దాంతో పవన్ ఆలోచన మార్చుకొనే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. అయితే రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి, ఇంత హడావిడి చేసి, తీరా ఇలా సడెన్ యూ టర్న్ తీసుకుంటే ఎలా ఉంటుందోనని పవన్ కాస్త కన్‌ఫ్యూజన్‌లో ఉన్నాడట. ఇకపోతే పవన్ సినిమాలకు సై అనాలే కానీ, ప్రముఖ నిర్మాణ సంస్థలు పవన్‌తో సినిమా చేయడానికి రెడీగా ఉన్నాయి.
ముఖ్యంగా మైత్రీ మూవీస్ సంస్థ పవన్‌తో ఇప్పటికిప్పుడు సినిమా చేసేందుకు రెడీగా ఉంది. పవన్ ఎంతంటే అంత రెమ్యునరేషన్ ఇచ్చి సినిమా చేయాలనుకుంటోంది. ఆల్రెడీ పవన్‌కి 45 కోట్లు ఆఫర్ చేసింది కూడా ఈ సంస్థ. ఇకపోతే నైజాం డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజు కూడా పవన్‌తో ఎప్పటి నుండో ఓ సినిమా చేయాలనుకుంటున్నాడు. తగిన అవకాశం కోసం ఎదురు చూస్తున్నాడంతే. ఇవన్నీ కాక పవన్ గతంలో కమిట్ అయిన కొన్ని ప్రాజెక్టులు కూడా పూర్తి చేయాల్సి ఉంది.
సో పవన్ యూ టర్న్ తీసుకుంటే, ఇమీడియట్‌గా ఏదో ఒక సినిమా పట్టాలెక్కేయడం ఖాయం. మరి పవన్ యూ టర్న్‌కి డెసిషన్ తీసుకుంటాడా? వేచి చూడాలిక.