సుకుమార్‌తో బన్నీ సర్‌ప్రైజ్‌!

By Inkmantra - October 30, 2019 - 12:00 PM IST

మరిన్ని వార్తలు

క్రియేటివ్‌ డైరెక్టర్‌ సుకుమార్‌ బన్నీని కూడా చరణ్‌లా మార్చేస్తాడా? ఏమో మార్చేసినా మార్చేస్తాడు. చిట్టిబాబు పాత్ర చరణ్‌ కెరీర్‌లోనే అత్యంత గొప్ప పాత్ర. ఆ మాటకొస్తే, ఆ సినిమాలో నటించిన సమంత, అనసూయ, ఆది పినిశెట్టి, జగపతిబాబు .. ఇలా ప్రతీ పాత్రకూ ఓ ప్రత్యేకత ఉంది. అలాగే ఇప్పుడు సుకుమార్‌ తెరకెక్కించబోయే అల్లు అర్జున్‌ సినిమాలోనూ పాత్రల డిజైనింగ్‌ అలాగే ఉండబోతోందట. ముఖ్యంగా అల్లు అర్జున్‌ మేకోవర్‌ గురించే అంతా మాట్లాడుకుంటున్నారు.

 

ఈ సినిమా కోసం అల్లు అర్జున్‌ ఓ డిఫరెంట్‌ మేకోవర్‌ ఇవ్వనున్నాడనీ ఫిలిం వర్గాల్లో టాక్‌ వినిపిస్తోంది. ఈ రోజు అనగా అక్టోబర్‌ 29న ఈ సినిమా పూజా కార్యక్రమాలతో ఘనంగా స్టార్ట్‌ కానుంది. డిశంబర్‌ నుండి రెగ్యులర్‌ షూట్‌ జరగనుంది. అయితే, ప్రస్తుతం 'అల వైకుంఠపురములో' సినిమాతో బన్నీ బిజీగా ఉన్నాడు. ఆ సినిమా పూర్తి అయ్యాక కానీ, ఈ సినిమా కోసం మేకోవర్‌ చూపించలేడు. అయినా ఈ సినిమా రెగ్యులర్‌ షూట్‌ స్టార్ట్‌ కానుందట. అంటే, ప్రస్తుతానికి సుకుమార్‌తో బన్నీ చేయబోయే స్టైలింగ్‌ ఎలా ఉంటుందో సస్పెన్సే. కానీ, ఖచ్చితంగా సర్‌ప్రైజింగ్‌ గెటప్‌లో బన్నీ కనిపించబోతున్నాడనీ తెలుస్తోంది.

 

రష్మికా మండన్నా ఈ సినిమాలో బన్నీకి జోడీగా నటిస్తోంది. మైత్రీ మూవీస్‌ బ్యానర్‌లో సినిమా రూపొందనుంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS