గత వారం విడుదలైన సినిమాల్లో `ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి` ఒకటి. ఇంద్రగంటి మోహన కృష్ణ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సుధీర్ బాబు, కృతి శెట్టి జంటగా నటించారు.
ఈ సినిమా డిజాస్టర్ గా మిగిలిపోయింది. ఇంద్రగంటి కెరీర్‌లో.. ఇదే పెద్ద ఫ్లాప్. ఈ సినిమాకి దాదాపు రూ.12 కోట్ల బడ్జెట్ అయ్యిందని తెలుస్తోంది. డిజిటల్ రైట్స్ రూపంలో ఇప్పటి వరకూ రూ.3 కోట్లు వచ్చాయి. మిగిలిన 9 కోట్ల భారం నిర్మాతపై పడిందని తెలుస్తోంది. ఈ సినిమాని కొనడానికి బయ్యర్లు ఎవరూ ముందుకు రాకపోవడంతో.. నిర్మాతలే స్వయంగా విడుదల చేశారు. సినిమా హిట్టయితే.. కనీసం బాక్సాఫీసు నుంచి రూ.10 కోట్లు రావాలి. ఈ సినిమా ఫ్లాప్ అవ్వడంతో మొత్తమ్మీద కోటి రూపాయలు కూడా వసూలు చేయలేకపోయింది. దాంతో.. నిర్మాతలు భారీ నష్టాలు మోయాల్సివస్తోంది.
ఈమధ్య సినిమాలు ఫ్లాప్ అయితే హీరోలు, దర్శకులు.. ఆ భారాన్ని పంచుకోవడానికి ముందుకొస్తున్నారు. ఇంద్రగంటి, సుధీర్ బాబులు సైతం.. నిర్మాతను ఆదుకోవడానికి తమ పారితోషికాల నుంచి కొంత తిరిగి ఇవ్వబోతున్నట్టు సమాచారం. ఎంత తిరిగిచ్చినా రూ.9 కోట్లను భర్తీ చేయడం అసాధ్యం.