'అల వైకుంఠపురము'లో.. బన్నీ, త్రివిక్రమ్‌!

మరిన్ని వార్తలు

'నాన్న నేను' అనే టైటిల్‌ అనుకున్నారట.. ఇంకోటేదో టైటిల్‌ గురించి ఆలోచిస్తున్నారట.. అంటూ చాలా గాసిప్స్‌ పుట్టుకొచ్చాయి అల్లు అర్జున్‌ - త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో సినిమా గురించి. కానీ, చివరికి 'అల వైకుంఠపురములో' అనే టైటిల్‌ కన్‌ఫామ్‌ అయ్యింది. స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు చెబుతూ, చిత్ర యూనిట్‌ ఓ గ్లింప్స్‌ని విడుదల చేసింది సోషల్‌ మీడియా వేదికగా. సింప్లీ సూపర్బ్‌ అనేలా వుంది ఈ గ్లింప్స్‌. అల్లు అర్జున్‌ గెటప్‌ని ఇందులో రివీల్‌ చేశారు. లైట్‌గా గడ్డం.. బాగా పెరిగిన జుట్టు.. వెరసి అల్లు అర్జున్‌ మాస్‌ లుక్‌తో అదరగొట్టేశాడు.

 

అల్లు అర్జున్‌ తో పాటు ఈ గ్లిప్స్‌లో కన్పించాడు విలక్షణ నటుడు మురళీ శర్మ. 'ఏంట్రోయ్‌ గ్యాప్‌ ఇచ్చావ్‌..' అని మురళీ శర్మ అడిగితే, 'ఇవ్వలే, వచ్చింది..' అని అల్లు అర్జున్‌ చెప్పడం గమనార్హం. 'నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా' సినిమా తర్వాత అల్లు అర్జున్‌ తీసుకున్న గ్యాప్‌ గురించి ఈ డైలాగ్‌ రాశాడా మాటల మాంత్రికుడు.? అని సోషల్‌ మీడియాలో అల్లు అర్జున్‌ అభిమానులే చర్చించుకుంటున్నారు.

 

ఓ ఖరీదైన భవంతి, ఆ వెంటనే 'అల వైకుంఠపురములో' టైటిల్‌ రివీల్‌ చేయడం.. ఆ తర్వాత ఓ డైలాగ్‌.. వెరసి ఈ గ్లింప్స్‌ ఓ రేంజ్‌లో రూపొందింది. త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ సినిమాల్లో చాలావరకు 'అ'తో స్టార్ట్‌ అయ్యే టైటిల్స్‌ వుంటాయి. అది సెంటిమెంటేనా.? అంటే, 'అలా కుదురుతుంటాయ్‌' అంటుంటాడు త్రివిక్రమ్‌. ఈ మధ్యకాలంలో మరీ 'అ' మీద త్రివిక్రమ్‌ ఎక్కువ ప్రేమ పెంచుకుంటున్నట్లే కన్పిస్తోంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS