'ఫోకస్ గ్రూప్స్' గురించి వినే ఉంటారు.. ఒక కొత్త వస్తువును జనాల్లోకి వదిలే ముందు.. దానికి ఏ మాత్రం సంబంధం లేని కొంతమందిని స్వచ్చంధంగా ఎంచుకుని వారికి దాని పై అవగాహన కలిపించి వారి నుండి 'ఫీడ్ బ్యాక్' తీసుకుని.. దానికి తగ్గట్టుగా మార్పులు చేసుకుని ఆ తరువాత ప్రజలకు ఆ వస్తువును అందిస్తారు. ఇలా స్వచ్చంధంగా వచ్చే వారినే 'ఫోకస్ గ్రూప్స్' అంటారు. మాములుగా ఈ తరహా 'ఫీడ్ బ్యాక్' ఔషధాలు లేదా నూతన యంత్రాలు తయారు చేసినప్పుడో లేదా ఎన్నికల ఫలితాలకు ముందు 'ఎగ్జిట్ పోల్' కోసమో వాడుతారు. కానీ మన యంగ్ హీరో అడివి శేష్ మాత్రం తన తాజా చిత్రం 'ఎవరు' కోసం వాడాడు.
గూఢచారి లాంటి బ్లాక్ బస్టర్ థ్రిల్లర్ తరువాత 'అడివి శేష్, రెజినా మరియు నవీన్ చంద్ర' నటించిన తాజా చిత్రం 'ఎవరు'. ఈ నెల 15న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రం పై చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు హీరో 'శేష్'. దానికి కారణం.. ఈ చిత్రాన్ని ప్రేక్షకులు ఎలా స్వీకరిస్తారో ఆయనకి ముందే తెలుసు.. ఎందుకంటే, ఈ చిత్రం 'ఫైనల్ కట్' రెడీ అయ్యాక 25 స్క్రీన్ టెస్టులు చేయించాడట మన హీరో.. దాని కోసం 1000 మందిని స్వచ్చంధంగా ఈ చిత్రాన్ని చూపించాడట వారి రియాక్షన్ ను బట్టి ఈ చిత్రానికి సాన పెట్టారట. టీజర్ లానే ఈ సినిమా కూడా ముందు స్లో గా మొదలై తర్వాత వేగవంతమైన స్క్రీన్ ప్లే తో ముగుస్తుందట. మరి దీన్ని థ్రిల్లర్ మూవీ లవర్స్ ఎలా స్వీకరిస్తారో 15న చూడాలి.