మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమాల్లో హీరోలు దాదాపు సాఫ్ట్‌గానే ఉంటారు. అయితే, 'అరవింద సమేత' కోసం ఎన్టీఆర్‌ని చిత్తూరు కుర్రోడిలా కాస్త రఫ్ లుక్‌లో చూపించాడు. అంతకు ముందు పవన్ కళ్యాణ్‌ని ('అజ్ఞాతవాసి'లో) సాఫ్ట్‌గా సాఫ్ట్వేర్ ఇంజనీర్ పాత్రలోనే చూపించాడు. ఇక తాజా సినిమాలో బన్నీని కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గానే చూపించబోతున్నాడనీ తాజా లుక్‌ని బట్టి అర్ధమవుతోంది. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన అఫీషియల్ లుక్కేం కాదిది. ఆన్ లొకేషన్ లుక్ ఒకటి సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఈ లుక్‌లో అల్లు అర్జున్ మెడలో ఐడీ కార్డ్ వేసుకుని, నార్మల్ వేర్లో నీట్ హెయిర్‌స్టైల్‌లో స్మార్ట్ అండ్ సాఫ్ట్‌గా కనిపిస్తున్నాడు.
ఆ వెనకే పూజా హెగ్దే అల్ట్రా మోడ్రన్ అండ్ స్టైలిష్ లుక్‌లో అందంగా కనిపిస్తోంది. నిజానికి ఇదేం ఒరిజినల్ పోస్టర్ కాదు. కానీ, ఫ్యాన్స్ ఈ స్టిల్స్‌ని ఓ పోస్టర్లా డిజైన్ చేసి నెట్టింట్లో వదిలేశారు. ఒరిజినల్ పోస్టర్కున్నంత క్లారిటీ ఈ పోస్టర్లో దించేశారు. మంచి రెస్పాన్స్ వస్తోంది ఈ పోస్టర్‌కి. గీతా ఆర్స్ట్ బ్యానర్లో అల్లు అరవింద్, హారికా హాసినీ బ్యానర్‌తో కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు ఈ సినిమాని. 'చిత్రలహరి' భామ నివేదా పేతురాజ్ ఈ సినిమాలో సెకండ్ హీరోయిన్గా నటిస్తోంది. సీనియర్ నటి టబు కీలక పాత్ర పోషిస్తోంది. వీరితో పాటు యంగ్ హీరో సుశాంత్, నవదీప్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ప్రస్తుతం హైద్రాబాద్‌లో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోన్న ఈ సినిమాకి 'అలకనంద' అనే టైటిల్‌ని పరిశీలిస్తున్నారు.