ఎన్టీఆర్ బయోపిక్‌లో రెండు భాగాలూ నిరాశ పరిచాయి. ఆ వెంటనే బోయపాటి శ్రీనుతో సినిమా ఉంటుందంటే అది వాయిదా పడింది. కె.ఎస్.రవికుమార్‌తో సినిమా ఓకే అయ్యింది గానీ ఇప్పటి వరకూ పట్టాలెక్కలేదు. మరి మన బాలయ్య పరిస్థితేంటి? అని వాపోతున్న నందమూరి అభిమానులకు శుభవార్త. బాలయ్య అతి త్వరలోనే సినిమా చేయబోతున్నాడు. కథ కూడా ఓకే అయిపోయింది. వివరాల్లోకి వెళ్తే.. బాలయ్య - కె.ఎస్.రవికుమార్ సినిమా పై కమ్ముకున్న నీలి నీడలు చెదిరిపోయాయి. ఈ కాంబోలో సినిమా గ్యారెంటీగా ఉండబోతోంది. ఈ నెలలో లాంఛనంగా ప్రారంభించి, వచ్చే నెలలో షూటింగ్ మొదలెట్టబోతున్నారు.
కాకపోతే.. అంతకు ముందు అనుకున్న కథని పూర్తిగా పక్కన పెట్టేశారు. కొత్త కథతో, కొత్త టైటిల్‌తో, కొత్త కాంబినేషన్‌తో ఈ సినిమా ఉండబోతోంది. సి.కల్యాణ్ ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తారు. సోమవారం బాలయ్య పుట్టిన రోజు సందర్భంగా కె.ఎస్ రవికుమార్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంలోనే బాలయ్యకు కొత్త కథ వినిపించారు. దానికి బాలయ్య కూడా ఓకే అనేశాడు. సో.. త్వరలోనే అఫీషియల్ ఎనౌన్స్మెంట్ రాబోతోంది.