కాజల్‌కి మెగా 'స్పెషల్‌' హిట్‌ ఇస్తుందా?

మరిన్ని వార్తలు

కెరీర్‌ డల్‌ అయిపోతున్న తరుణంలో కాజల్‌ అగర్వాల్‌ 'జనతా గ్యారేజ్‌' సినిమాలో ఐటెం సాంగ్‌లో మెరిసింది. 'పక్కా లోకల్‌' అంటూ ఎన్టీఆర్‌ పక్కన మాస్‌ స్టెప్పులేసి అలరించిన కాజల్‌కి ఆ తర్వాత 'ఖైదీ నెం150'లో ఛాన్స్‌ రావడం, ఆ సినిమా సూపర్‌ డూపర్‌ హిట్‌ అవ్వడం చకచకా జరిగిపోయాయి. అంతవరకూ స్పెషల్‌ సాంగ్స్‌ జోలికి పోని కాజల్‌కి అది టర్నింగ్‌ పాయింటే అని చెప్పాలి. ఆ తర్వాత హీరోయిన్‌గా బిజీ అయిపోవడంతో, మళ్లీ ఐటెం సాంగ్స్‌ జోలికి పోలేదు కాజల్‌. కానీ, ఇప్పుడు మళ్లీ కాజల్‌ ఐటెం సాంగ్‌పై హాట్‌ హాట్‌గా వార్తలు వినిపిస్తున్నాయి. స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ తాజా చిత్రంలో కాజల్‌ స్పెషల్‌ సాంగ్‌ చేస్తోందంటూ గాసిప్స్‌ వస్తున్నాయి.

 

ఈ గాసిప్స్‌లో నిజమెంతో తెలీదు కానీ, ఒక్క ఐటెం సాంగ్‌కి హిట్‌ పవర్‌ అంతలా ఉంటుందా.? అని కాజల్‌ని చూసి అర్ధం చేసుకోవచ్చు. కాజల్‌ ఐటెం సాంగ్‌ చేసిన 'జనతాగ్యారేజ్‌' సూపర్‌ హిట్‌ అయ్యింది. తర్వాత 'ఖైదీ'తో ఏకంగా మెగా హిట్‌ కొట్టేసింది చందమామ. ఇదిలా ఉంటే, కాజల్‌కి ప్రస్తుత తరుణం చాలా కీలకం. లేటెస్ట్‌గా 'సీత' సినిమారవ కాజల్‌ ఫెయిల్యూర్‌ చవి చూసింది. తదుపరి శర్వానంద్‌ సినిమాతో రాబోతోంది. పెద్దగా అంచనాల్లేవు ఈ సినిమాపై. సో ప్రచారంలో ఉన్న స్పెషల్‌ సాంగ్‌ ఆఫర్‌ని కాజల్‌ దక్కించుకుందంటే, హిట్‌ ఫార్ములా తన చేతిలో పెట్టుకున్నట్లే అనే హింట్‌ ఇస్తున్నారు కాజల్‌ అభిమానులు. దాంతో బన్నీతో స్పెషల్‌ సాంగ్‌ విషయమై కాజల్‌ కూడా ఒకింత పోజిటివ్‌ థాట్‌ చేస్తున్నట్లు తెలుస్తోంది. మరి కాజల్‌కి కావల్సింది దక్కుతుందా.? చూడాలి మరి.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS