శ్రీరెడ్డి ఈ సారి 'అలా' రెచ్చిపోయింది!

మరిన్ని వార్తలు

సినీ ప్రముఖులపై పచ్చిగా విమర్శలు చేసి చేసి విసుగుపుట్టినట్లుంది శ్రీరెడ్డికి. ఈ సారి తనపై తానే విమర్శలు చేసుకుంది. విమర్శలు అనే కంటే, తన గురించి నిజాలు కుండబద్దలుకొట్టేసిందనాలేమో. సినీ ప్రముఖుల వారసులతో అఫైర్స్‌ అంటూ శ్రీరెడ్డిపై పలు ఆరోపణలున్న సంగతి తెలిసిందే. అయితే వాటిని కన్‌ఫామ్‌ చేస్తూ, శ్రీరెడ్డి నోటి నుండి జారిన ఆణిముత్యాలు నెటిజన్స్‌ని విస్తుపోయేలా చేస్తున్నాయి. వార్తల్లో లైమ్‌ లైట్‌ కోసం తన క్యారెక్టర్‌ని స్వయంగా తన నోటితోనే ఇంతలా దిగజార్చేసుకోవాలా.? అని నెటిజన్లు శ్రీరెడ్డిపై విమర్శలు గుప్పిస్తున్నారు. తనకు పెళ్లి సూట్‌ కాదనీ, తాను ప్లే గాళ్‌ టైప్‌ అనీ, డేటింగ్‌లోనే కనీసం ఓ ఏడాది పాటు ఉండలేని తనకు పెళ్లి వర్కవుట్‌ కాదనీ.. ఇంకా చాలా విషయాలు పచ్చిగా బయటపెట్టేసింది.

 

పలానా సినీ హీరో పలానా టైంలో అలా చేశాడు. పలానా సినీ ప్రముఖుడు ఇలా చేశాడు.. అంటూ ఇతరులపైనే ఇంతవరకూ ఆరోపణలు చేసిన శ్రీరెడ్డి కొత్త అస్త్రం సంధించింది. తనపై తానే హాట్‌ కామెంట్స్‌ చేసుకుని, ఇంకోసారి వార్తల్లో హాట్‌ టాపిక్‌ అయ్యింది. కాస్టింగ్‌ కౌచ్‌ పేరుతో అమ్మడు చేసిన రచ్చని ఎవ్వరూ పట్టించుకోలేదు. పచ్చి ఆరోపణలు పిచ్చి పిచ్చిగా చేసినా ఎవ్వరూ లెక్క చేయలేదు. ఇక ఆఖరికి ఇదిగో ఇలా దిగిజారిపోయిందన్న మాట. ఏదో కాస్టింగ్‌ కౌచ్‌ పబ్లిసిటీ పుణ్యమా అని సినిమాల్లో ఒక అవకాశం వచ్చినట్లే వచ్చి చేజారిపోయింది. తెలుగు బిగ్‌బాస్‌ రియాల్టీ షోలో కంటెస్టెంట్‌గా ట్రై చేసింది కానీ, అదీ వర్కవుట్‌ కాలేదు. ఇప్పుడు తమిళ బిగ్‌బాస్‌లో శ్రీరెడ్డికి అవకాశం దక్కిందంటున్నారు. ఏమో ఈ వార్తలో నిజమెంతో తెలియాల్సి ఉంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS