బాహుబ‌లిపై క‌న్నేసిన బ‌న్నీ!

మరిన్ని వార్తలు

త‌న స్టామినా ఏమిటో 'అల‌.. వైకుంఠ‌పుర‌ములో'తో మ‌రోసారి చూపించాడు అల్లు అర్జున్‌. బాహుబ‌లి 1 రికార్డుల‌న్నీ బ‌ద్ద‌లు కొట్టేసి, బాహుబ‌లి 2 రికార్డుకి అతి స‌మీపంలో వెళ్లింది బ‌న్నీ సినిమా. టాప్ 2లోనూ చేరిపోయింది. ఇప్పుడు సుకుమార్‌తో జట్టు క‌ట్టాడు. వీరిద్ద‌రి కాంబినేష‌న్ లో ఓ సినిమా ప‌ట్టాలెక్కిన సంగ‌తి తెలిసిందే. ర‌ష్మిక క‌థానాయిక‌. కొంత మేర చిత్రీక‌ర‌ణ కూడా జ‌రిగింది. బ‌న్నీ ఎంట్రీ కోసం ఎదురుచూస్తున్న వేళ లాక్ డౌన్ తో షూటింగ్ ఆగిపోయింది. లాక్ డౌన్ ఎత్తేశాక‌.. నేరుగా ఈ సినిమా సెట్స్ పైకి వెళ్ల‌డానికి స‌న్నాహాలు చేస్తోంది.

 

ఈనెల 8న అల్లు అర్జున్ పుట్టిన రోజు. ఈ సంద‌ర్భంగా ఈ సినిమా టైటిల్ ని ప్ర‌క‌టించే అవ‌కాశాలున్నాయ‌ని తెలుస్తోంది. దాంతో పాటు రిలీజ్ డేట్ కూడా చెప్పేస్తే ఎలా ఉంటుందా అని భావిస్తోంది చిత్ర‌బృందం. 2021 ఏప్రిల్ 28న విడుద‌ల చేయాల‌న్న‌ది చిత్ర‌బృందం ప్లాన్‌. ఆ రోజుకి ఓ ప్ర‌త్యేక‌త ఉంది. బాహుబ‌లి 2 రిలీజ్ డేట్ అది. ఆ రోజున విడుద‌లైన బాహుబ‌లి 2 ఎన్ని సంచ‌ల‌నాలు సృష్టించిందో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. ఆ సెంటిమెంట్‌తోనే బ‌న్నీ ఈ సినిమాని ఆ రోజున విడుద‌ల చేయాల‌ని ప్లాన్ చేస్తున్నాడ‌ని స‌మాచారం. అయితే ప్ర‌స్తుతం లాక్ డౌన్ స‌మ‌యం న‌డుస్తోంది.

 

లాక్ డౌన్ ఎప్పుడు ఎత్తేస్తారో, ఎప్పుడు షూటింగులు మొద‌ల‌వుతాయో చెప్ప‌లేం. ఇలాంటి సందిగ్థ ప‌రిస్థితుల్లో రిలీజ్ డేట్ ప్ర‌కటించ‌డం అతి విశ్వాసం అవుతుంద‌న్న భ‌యం కూడా నెల‌కొంది. మ‌రి.. ఈ భ‌యాన్ని దాటుకుని, రిలీజ్ డేట్ ప్ర‌క‌టించే ధైర్యం చేస్తారేమో చూడాలి.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS