శింబుతో నరకం చూసాను అని చెప్పిన నిర్మాత

మరిన్ని వార్తలు

తమిళ హీరో శింబు అంటేనే వివాదాలకి కేరాఫ్ అడ్రస్. దాదాపు ఆయన వార్తల్లోకి ఎక్కిన అంశాలు ఎక్కువగా వివాదాలతోనే అని అనడంలో ఎటువంటి సందేహం లేదు.

ఇక ఆయనతో ఈ మధ్యనే AAA అనే చిత్రాన్ని నిర్మించిన నిర్మాత ఎన్. మైఖేల్ రాయప్పన్ ఆ చిత్ర నిర్మాణంలో హీరో శింబు తనని ఎంత ఇబ్బంది పెట్టాడో సవివరంగా అందరికీ తెలియచేశాడు. సినిమా ఒప్పుకున్న నాటి నుండి ఏదో ఒక వంక పెడుతూ షూటింగ్ కి రాకుండా ఉండటం, హీరోయిన్ ని పలుమార్లు మార్చేసేయమని చెప్పడం వంటి వాటితో యూనిట్ మొత్తాన్ని ఇబ్బందులకు గురిచేశాడట.

షూటింగ్ ప్లాన్ చేసిన రోజులు 76 కాగా శింబు మాత్రం కేవలం 38 రోజులు రావడం చూస్తేనే ఆయన ఈ చిత్రం పైన ఎంత బాధ్యతగా ఉన్నాడు అన్నది తెలుస్తుంది అని సదరు నిర్మాత తన బాధని వెళ్ళగక్కాడు.

ఇక చివరికి తన పాత్రలకి డబ్బింగ్ కూడా చెప్పకుండా తిప్పించుకుని చివరికి తన ఇంటినుండే ఫోన్ లో వాయిస్ రికార్డ్ చేసి పంపడం, అది కూడా క్వాలిటీ లేకపోవడం తో ఇబ్బంది పడ్డాము అని తన కష్టాలని చెప్పుకొచ్చాడు.

మరి ఈ ఆరోపణల పై శింబు రియాక్షన్ ఏంటి అన్నది చూడాలి.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS