విజయ్ మెర్సల్ (తెలుగులో అదిరింది) చిత్రం విడుదల సమయంలో వచ్చిన వివాదాలు అన్ని ఇన్ని కావు. అది ఒకరకంగా ఆ చిత్రం కలెక్షన్స్ కిసహాయం చేసింది అనే చెప్పాలి.
మెర్సల్ చిత్రం దాదాపుగా రూ250 కోట్లు వసూలు చేసింది అని ట్రేడ్ వర్గాలు లెక్కలు చెప్పాయి. ఇదిలావుండగా ప్రముఖ నటుడు, బీజీపీ నాయకుడు ఎన్.వీ. శేఖర్ ఈ చిత్రం కలెక్షన్స్ గురించిన కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అదేంటంటే- ఈ చిత్రానికి దాదాపు రూ 60కోట్ల మెర నష్టం వాటిల్లింది అని సంచలన వ్యాఖ్యలు చేశాడు.
దీనితో ఒక్కసారిగా మళ్ళీ మెర్సల్ చిత్రం వార్తల్లో నిలిచింది. ఇక ఈ నష్టానికి కారణం కూడా దర్శకుడు అట్లీ తీసుకున్న పారితోషకమే అని తేల్చి చెప్పాడు.
ఇక ఈ వ్యాఖ్యల పై మెర్సల్ చిత్రం స్పందిచాల్సి ఉంది.