అందాల భామ ఆదాశర్మ ఏం చేసినా అంతే చాలా కొత్తగా ఉంటుంది. తాజాగా 'హెల్త్' మ్యాగజైన్‌పై బికినీలో ఎలా వయ్యారాలు పోయిందో చూశారుగా. హెల్త్ టిప్స్ కోసం ఇలా బికినీలో విప్పి చెప్పాలా పాపా.. అంటూ సోషల్ మీడియాలో అమ్మడికి పోస్ట్‌లు పెడుతున్నారు. 'ఫైవ్ కామన్ ఎక్సర్సైజ్ మిస్టేక్స్' అని, మల్లకంభ, డాన్స్ అండ్ డ్రామా, మార్షల్ ఆర్ట్స్, గ్లాడియేటర్ వర్కవుట్స్ అంటూ ఆదాశర్మకు వెన్నతో పెట్టిన విద్యలన్నింటినీ మెన్షన్ చేశారు ఈ పోస్టర్‌పై. ఈ మ్యాగ్జైన్ కవర్ పేజీపై ఆదా శర్మ ఇచ్చిన పోజు సమ్‌థింగ్ డిఫరెంట్‌గా ఆకట్టుకుంటోంది. డిజైన్డ్ కట్ సింగిల్ పీస్ బికినీలో, కాళ్లకి వేయాల్సిన షూస్ వయ్యారంగా చేతిలో పట్టుకుని నిలబడింది.
కళ్లకు పింక్ కలర్ కాజల్‌తో థిక్ షేడ్ ఇచ్చింది. ఇక హెయిర్‌ని లూజ్‌గా వదిలేసి, బికినీ పైన ధరించిన ఆ ట్రాన్స్పరెంటెడ్ ప్లాస్టిక్ ప్యాటర్న్‌ని ధరించింది. ఎల్లో కలర్ పైపింగ్ లైన్‌తో ఉన్న ఆ ప్యాటర్న్ ఆదా ఎందుకు ధరించిందా.? అని బుర్రలు బాదుకుంటున్నారు చూసిన నెటిజన్లు. ఏది ఏమైతేనేం.. మొత్తానికి ఈ పోజుతో మరోసారి కుర్రకారు గుండెలకి పుసుక్కున హార్ట్ ఎటాక్ తెప్పించేసిన ఈ బికినీ బేబ్ 'కల్కి' సినిమాతో త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.