హీరోలైనా, హీరోయిన్స్ అయినా సినిమాల్లో కొన్ని సీన్స్ కోసం ప్రాణాలకు తెగించి పోరాడాల్సి వస్తుంది. అఫ్‌కోర్స్, అది వారి కమిట్‌మెంట్‌ని బట్టి ఉంటుందనుకోండి. డూప్స్ వాడి రిస్కీ షాట్స్ కంప్లీట్ చేసేయొచ్చు. కానీ, నేటి తరం నటీ నటులు రిస్క్ లేకపోతే, లైఫ్‌లో దొరికేది రస్క్ మాత్రమే అంటూ, రిస్క్‌లు సునాయాసంగా చేసేందుకు ఇష్టపడిపోతున్నారు. లక్ కలిసొస్తే, అది పబ్లిసిటీకి పనికొస్తుంది. లేదంటే, ఓ ఎక్స్‌పీరియస్స్‌గా మిగిలిపోతుంది. అసలు వివరాల్లోకి వెళితే, ముద్దుగుమ్మ అనన్యా పాండే తన లైఫ్‌లో జరిగిన ఓ రిష్కీ షాట్ గురించి కొంచెం హార్ట్ టచ్చింగ్‌గా చెప్పుకొచ్చింది. లేటెస్ట్‌గా ప్రేక్షకు ముందుకొచ్చిన 'స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2' లో హీరోయిన్‌గా నటించింది అనన్యా పాండే.
టైగర్ ష్రాఫ్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమాలో అనన్యతో పాటు, తారా సుతారియా మరో హీరోయిన్‌గా నటించింది. విడుదలకు ముందు భారీ అంచనాలు నమోదు చేసిన ఈ సినిమా విడుదలయ్యాక తుస్‌మనిపించింది. దాంతో పాపం ఫీలయిన అనన్య పాప ఈ సినిమా కోసం తానెంత కష్టపడాల్సి వచ్చిందో అంటూ సింపథీ క్రియేట్ చేసుకునే ప్రయత్నం చేసింది. ఈ సినిమా షూటింగ్‌లో భాగంగా ఓ రిస్కీ షాట్‌లో అనన్య నటించాల్సి వచ్చిందట. దాదాపు చావు అంచుల దాకా వెళ్లొచ్చానని చెప్పుకొచ్చింది. లక్కు కలిసొచ్చి, బతికి బట్ట కట్టానని లేకుంటే తననెప్పుడో మర్చిపోయేవారని చెబుతోంది. ఈ సినిమా రిజల్ట్ ఎలా ఉన్నా, పాపకి గ్లామర్‌లో మాంచి టేస్ట్ ఉంది. ఎక్స్‌పోజింగ్‌కి ఎటువంటి మొహమాటాలూ లేవు. ఒకవేళ అవకాశమొస్తే, సౌత్ వైపు దూకేయడానికి కూడా రెడీగా ఉంది. మరి ఈ స్టూడెంట్ పాపకి సౌత్ వాళ్లు ఛాన్సిచ్చి రప్పించుకుంటారా.? చూడాలిక.