యంగ్ హీరో ఆది పినిశెట్టికి 'రంగస్థలం'లో కుమార్‌బాబు క్యారెక్టర్ మంచి బ్రేక్ ఇచ్చిందని చెప్పొచ్చు. ఈ సినిమా తర్వాత ఆది చాలా బిజీ అయిపోయాడు. అంతకు ముందు కూడా ఆది బిజీగానే ఉన్నాడు. ఓ పక్క హీరోగా సినిమాలు చేస్తూనే, మరో పక్క విలన్‌గానూ సత్తా చాటాడు. వీలు చిక్కినప్పుడల్లా ఇంపార్టెన్స్ ఉన్న క్యారెక్టర్స్నీ వదిలిపెట్టలేదు. అందుకే ఆది అంటే ప్రత్యేకమైన అభిమానం ఉంది ఆడియన్స్‌తో పాటు, ఇండస్ట్రీలో. తెలుగు, తమిళ భాషల్లో ఆది తనదైన స్టార్డమ్తో చెలామణీ అవుతున్నాడు. ఆల్రెడీ హీరోగా కొన్ని ప్రాజెక్టులు ఆది చేతిలో ఉన్నాయి.
తాజాగా పృధ్వి ఆదిత్య దర్శకత్వంలో ఆది హీరోగా ఓ సినిమా స్టార్ట్ అయ్యింది. ఈ రోజు లాంఛనంగా ఈ సినిమా పూజా కార్యక్రమాలతో మొదలైంది. లాంఛింగ్ డేని చాలా గ్రాండ్‌గా నిర్వహించారు. తెలుగు, తమిళ భాషల్లో బైలింగ్వల్ మూవీగా తెరకెక్కుతోన్న ఈ చిత్రం ఓపెనింగ్ డేకి మ్యూజిక్ దర్శకుడు ఇళయరాజా, నేచురల్ స్టార్ నాని, అల్లు అరవింద్, బోయపాటి శీను, బొమ్మరిల్లు భాస్కర్ తదితరులు ముఖ్య అతిధులుగా విచ్చేశారు. 'క్లాప్' అనే టైటిల్‌ని ఈ సినిమాకి ఫిక్స్ చేశారు. 'మళ్లీ రావా' ఫేం ఆకాంక్షసింగ్ ఈ సినిమాలో ఆదితో జత కడుతోంది.