విలక్షణ పాత్రలకు చిరునామాగా నిలిచాడు ఆది పినిశెట్టి. రంగస్థలం, సరైనోడుతో... సహాయక ప్రతినాయక పాత్రలు కూడా ఆదిని వెదుక్కుంటూ వస్తున్నాయి. మరోవైపు.. కథానాయకుడిగానూ సినిమాలు చేస్తున్నాడు. తాజాగా ఆది ఓ ద్విభాషా చిత్రానికి సంతకం చేశాడు. తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కే ఈ చిత్రంతో ప్రిత్వి ఆదిత్య దర్శకుడిగా పరిచయం కాబోతున్నాడు.
క్రీడా నేపథ్యంలో సాగే కథ ఇది. భాగ్ మిల్కా భాగ్ టైపులో సాగే స్పోర్ట్స్ డ్రామా. ఇందులో ఆది అథ్లెట్‌గా కనిపించబోతున్నాడు. ఈ పాత్ర కోసం ఆది ప్రత్యేక కసరత్తులు చేస్తున్నాడు. అంతర్జాతీయ కోచ్‌ల సలహాలు తీసుకుని, తన బాడీని మార్చుకుంటున్నాడు. కథానాయిక, ఇతర సాంకేతిక నిపుణుల ఎంపిక జరుగుతోంది. త్వరలోనే ఈ చిత్రం సెట్స్‌పైకి వెళ్లనుంది.