నందమూరి బాలకృష్ణ ప్రతిష్టాత్మకంగా నిర్మించి, నటించిన చిత్రం ఎన్టీఆర్ బయోపిక్. రెండు భాగాలుగా విడుదలైన (ఎన్టీఆర్ కథానాయకుడు, మహానాయకుడు) ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఆశించిన విజయాన్ని సాధించలేకపోయింది. అయితే బాలయ్య తదుపరి చిత్రం సి. కళ్యాణ్ నిర్మాతగా, కె.ఎస్. రవికుమార్ దర్శకత్వం లో నటిస్తున్న విషయం తెలిసిందే. గతంలో వీళ్ళ కాంబినేషన్ లో 'జై సింహ' అనే చిత్రం విడుదలై మంచి విజయాన్ని సాధించింది.
ఇప్పుడు కొత్త చిత్రానికి సంబంధించిన ఆసక్తి కరమైన విషయం బయటికి వచ్చింది. ఈ చిత్రం లో బాలయ్య కి మెయిన్ విలన్ గా జగపతిబాబు నటించబోతున్నారు. గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన లెజెండ్ చిత్రం అటు బాలయ్య మరియు జగపతి బాబుకు తిరుగులేని విజయాన్నిఅందించింది. జగపతిబాబు సెకండ్ ఇన్నింగ్స్ కు ఈ చిత్రం అద్భుతమైన ఆరంభంగా నిలిచింది. తెరపైన వీరిద్దరిని మళ్ళీ ఎప్పుడు చూస్తామా అని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
లెజెండ్ లో పోటాపోటీగా నటించిన వీళ్ళిద్దరూ.. మళ్ళీ ఈ సినిమా ద్వారా ముందుకురావడం బాలయ్య అభిమానులకు గుడ్ న్యూస్ అనే చెప్పాలి మరి.