అజయ్‌దేవగణ్‌ రూటే సెపరేటు!

మరిన్ని వార్తలు

కెరీర్‌ మొదట్నుంచీ విలక్షణ కథలు ఎంచుకుంటూ, హీరోగా తనదైన ప్రత్యేకతను చాటుకున్నాడు బాలీవుడ్‌ హీరో అజయ్‌దేవగణ్‌. ఇప్పుడు వయసుకు తగ్గ పాత్రల్లో ఇమిడిపోవాలనుకుంటున్నాడట. కుర్రహీరో పాత్రలు వయసులో ఉన్నప్పుడు పోషించేశాం. ఇక చాలు, ఇప్పుడు నా రియల్‌ వయసుకు తగ్గ పాత్రల్లోనే తెరపై కూడా కనిపించాలని కోరుకుంటున్నాను. ఆ దిశగా నా వయసు పాత్రలను కూడా దృష్టిలో పెట్టుకుని, రచయితలు కథలు ప్రిపేర్‌ చేయాలని కోరుకుంటున్నాను అని అజయ్‌ దేవగణ్‌ చెబుతున్నాడు. నిజానికి హీరోలెవ్వరూ ఇలాంటి నిర్ణయాలు తీసుకోరు. అందుకే కదా అజయ్‌దేవగణ్‌ రూటే సెపరేట్‌.

 

 

యాక్షన్‌ హీరో అయినా ఫ్యామిలీ హీరో ఇమేజ్‌ కూడా అజయ్‌దేవగణ్‌కి ఎక్కువే. ఇకపోతే ప్రస్తుతం అజయ్‌దేవగణ్‌ నటిస్తున్న చిత్రం 'దేదే ప్యార్‌ దే' కూడా ఆయన వయసుకు తగ్గ సినిమానే. ఏభై ఏళ్లు పైబడిన వ్యక్తి భార్యకు దూరంగా ఉంటే, ఆయనలోని కోరికలు ఎలా ఉంటాయి.? అలాంటి వ్యక్తి అనుకోకుండా టీనేజ్‌ అమ్మాయి ప్రేమలో పడితే, ఆ పరిస్థితులు ఎలా ఉంటాయి.? అనే కథాంశంతో ఈ సినిమా తెరకెక్కింది. ఈ నెల 17న ప్రేక్షకుల ముందుకు రానుంది. టబు, రకుల్‌ ప్రీత్‌సింగ్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇకపోతే, తెలుగులో ప్రతిష్ఠాత్మక చిత్రం 'ఆర్‌ఆర్‌ఆర్‌'లో అజయ్‌దేవగణ్‌ ఓ కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. ఇదే అజయ్‌దేవగణ్‌కి తెలుగులో తొలి చిత్రం. రాజమౌళి వంటి దర్శకుడితో కలిసి పని చేయడం ఎంతో సంతోషంగా ఉందని అజయ్‌దేవగణ్‌ చెబుతున్నారు. చరణ్‌, ఎన్టీఆర్‌ కాంబినేషన్‌లో మెగా మల్టీస్టారర్‌గా రూపొందుతోన్న ఈ చిత్రంలో బాలీవుడ్‌ భామ అలియాభట్‌ ఓ హీరోయిన్‌గా నటిస్తున్న సంగతి తెలిసిందే.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS