'పాట్నర్‌' కాబోతున్న కుమార్‌ బాబు.!

మరిన్ని వార్తలు

'రంగస్థలం' సినిమాతో యంగ్‌ హీరో ఆది పినిశెట్టికి విపరీతమైన క్రేజ్‌ దక్కింది. హీరోగా పలు చిత్రాల్లో నటించినా దక్కని క్రేజ్‌ ఈ సినిమాలో చరణ్‌కి అన్నగా కుమార్‌బాబు పాత్రతో దక్కించుకున్నాడు ఆది పినిశెట్టి. తాజాగా ఆది హీరోగా ఓ సినిమా రూపొందుతోంది. మనోజ్‌ దామోదరన్‌ ఈ సినిమాకి దర్శకుడు. 'పాట్నర్‌' అనే టైటిల్‌ని ఈ సినిమాకి ఫిక్స్‌ చేశారు. 

 

లేటెస్ట్‌గా ఈ సినిమా పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. ఈ సినిమాలో ఆదికి జోడీగా ముద్దుగుమ్మ హన్సిక నటిస్తోంది. హీరోగానే కాకుండా విలక్షణ పాత్రలకు సై అనే నటుల్లో ఆది ముందుంటాడు. 'ఒక విచిత్రం' సినిమాతో హీరోగా తెలుగు తెరకు పరిచయమైన ఆది పినిశెట్టి తర్వాత తమిళంలోనూ పలు చిత్రాల్లో నటించాడు. తెలుగులో హీరోగానే కాకుండా సపోర్టింగ్‌ రోల్స్‌లోనూ, ఇంపార్టెంట్‌ క్యారెక్ట్స్‌తో మెప్పించాడు. 

 

అల్లు అర్జున్‌ నటించిన 'సరైనోడు' సినిమాతో విలన్‌గా కూడా తన టాలెంట్‌ చూపించాడు. తర్వాత 'అజ్ఞాతవాసి'లో విలన్‌గా పవర్‌స్టార్‌ పవన్‌కళ్యాణ్‌తో పోటీ పడి నటించాడు. కథ నచ్చితే ఎలాంటి పాత్రకైనా సిద్ధంగా ఉండే నటుడు ఆది పినిశెట్టి. కథా కమామిషు వివరాలు పూర్తిగా తెలీదు కానీ, ఈ తాజా చిత్రం 'పాట్నర్‌'తో ఎలా ఆకట్టుకుంటాడో చూడాలి మరి. 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS